ఖమ్మం వార్తలు

తిర్మలాయపాలెం ప్రభుత్వ ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి అందుబాటులో లేని సిబ్బంది పై ఆగ్రహాం…

తిర్మలాయపాలెం ప్రభుత్వ ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి అందుబాటులో లేని సిబ్బంది పై ఆగ్రహాం…
-తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి ఆదేశం

  • విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరిక
    -ఆసుపత్రికి వచ్చే ప్రతీ ఒక్కరికీ మెరుగైన సేవలు అందాలి
    -ప్రజలకు జవాబుదారిగా ఉండాలన్న పొంగులేటి

ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషంట్, అవుట్ పేషంట్ రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో తనిఖీ సమయంలో విధుల్లో లేని వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వెలిబుచ్చారు. అనుమతి లేని గైర్హాజరు పై సంజాయిషీకి ఆదేశించాలన్నారు. ఈమేరకు జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు … ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని, ఆరు హామీల్లో వైద్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అమలులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో పేదలు ఎక్కువగా ఉంటారని, పేదలకు అందుబాటులో ఉండి, మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి తనిఖీ సందర్భంగా జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, తిరుమలాయపాలెం ఎంపిడివో సిహెచ్. శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నెల్లూరి వీరభద్రం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, రాష్ట్ర రెవెన్యూ,హైజింగ్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కండువా కప్పి స్వాగతం పలికారు. బుధవారం కూసుమంచి మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టుసింగారం గ్రామం రాగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ నాయకురాలు వెల్లంపల్లి కాంతమ్మ నివాసం కు మంత్రి వెళ్ళగా కాంతమ్మ, నెల్లూరి వీరభద్రం కుటుంబం శాలువాతో ఘనంగా సన్మానించారు‌. అనంతరం నెల్లూరి వీరభద్రం, ఆయన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావడం కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేశారని,భారీ మెజారిటీతో విజయం వచ్చే విధంగా కృషి చేశారని అన్నారు. మీరీచ్చిన ఈ గౌరవం ఎన్నడూ మరువలేనిదని అన్నారు. మీ కృషికి ఫలితం దక్కే విధంగా మేము పనిచేస్తామని, ప్రజారంజకంగా పరిపాలన అందిస్తామన్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామినిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం మనందరిపై ఉంటుందన్నారు. అందుకే గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. పాత, కొత్త పార్టీ నాయకులందరిని గౌరవిస్తామని, కష్టానికి తగిన ప్రతిఫలం కాంగ్రెస్ అందిస్తుందని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మట్టె గురవయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు, చరణ్ రెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్, పెండ్ర అంజయ్య, బజ్జూరి వెంకట్ రెడ్డి, జూకూరి గోపాల్, సుధాకర్ రెడ్డి, వడ్తియా సెట్రామ్ నాయక్, సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మునుగంటి రాములు, గట్టుసింగారం సర్పంచ్ నెల్లూరి ఖాదర్ బాబు, ఆలేటి రాంబాబు, కాంతారావు, గుడిపల్లి రాధాకృష్ణ, వీరారెడ్డి, చాట్ల సత్యనారాయణ, సుధాకర్, హనుమారెడ్డి, పాపారావు, ఉమా, రెడ్డిబోయిన రమణ, నాగిరెడ్డి, పాషా,ఉదయ్, లోడిగ రమేష్, రవి, శేషిరెడ్డి, రాములు, బానోతు సుఖ్య తదితరులు హాజరైయ్యారు.

అంతకు ముందు మంత్రి కూసుమంచి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు …అర్హలందరికి ప్రభుత్వ పథకాల లబ్ది అందిస్తామని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళ్యాణలక్ష్మి పథకం క్రింద 12 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116 ల చొప్పున రూ. 12,01,392 లను అందజేసినట్లు అన్నారు.

 ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, కూసుమంచి ఎంపిడివో ఆర్. రమాదేవి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.     పర్యటనలో ఖమ్మం  రూరల్ మండలంలోని  చింతపల్లి వెళ్లిఇటీవల మరణించిన  సిపిఐ నాయకుడు  రామయ్య కుటుంబాన్ని పరామర్శించారు ..   ఖమ్మం నగరంలోని శెట్టి రంగారావు ఇంటికి వెళ్లి ఆయన సోదరుడు చనిపోయినందున కుటుంబసభ్యులను మంత్రి పొంగులేటి  పరామర్శించారు .. ...

Related posts

నేను గుత్తేదారును కాను …నువ్వు గుత్తేదారుకాక గాడిదపాళ్ళుతోముతున్నావా..పోంగులేటిపై కందాల ఫైర్

Ram Narayana

SFI Former Students Meet Grand Success in Khammam…

Ram Narayana

తన హయాంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం గొప్ప సంతృప్తి …మంత్రి పొంగులేటి

Ram Narayana