Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలుప్రమాదాలు ...

కారు ప్రమాదం… బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు స్వల్ప గాయం

  • హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో వెళ్లిన సీఎం   
  • బుర్ద్వాన్‌లో మమతా బెనర్జీ కాన్వాయ్‌లోకి అకస్మాత్తుగా ప్రవేశించిన కారు
  • సడన్ బ్రేక్ వేసిన కారు డ్రైవర్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఆమె తలకు చిన్న గాయమైంది. బుధవారం బుర్ద్వాన్‌లో మమతా బెనర్జీ కాన్వాయ్‌లోకి అకస్మాత్తుగా ఓ కారు ప్రవేశించింది. దీంతో మమత ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో స్వల్ప ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలించకపోవడంతో ఆమె రోడ్డు మార్గంలో వెళుతున్న సమయంలో బుర్ద్వాన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి తలకు స్వల్పగాయం అయిందని ప్రాథమిక నివేదిక తెలిపింది.

Related posts

ఉచ్చులో పడిన చిరుతను చంపి వండుకు తిన్న వేటగాళ్లు!

Ram Narayana

నిపా సెకండ్ వేవ్ లేదన్న కేరళ మంత్రి.. ఊపిరి తీసుకుంటున్న ప్రజలు

Ram Narayana

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం.. తగలబడ్డ బోగీలు

Drukpadam

Leave a Comment