Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్

  • ఏప్రిల్ 13న సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి
  • ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • నేడు విజయవాడ కోర్టులో హాజరు
  • మే 2 వరకు రిమాండ్ విధించిన జూనియర్ సివిల్ జడ్జి

ఈ నెల 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని ఇవాళ విజయవాడ కోర్టులో హాజరుపర్చగా… న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. మే 2 వరకు అతడికి రిమాండ్ విధిస్తున్నట్టు విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పేర్కొన్నారు. 

కాగా, నిందితుడి పుట్టినతేదీపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఆధార్ కార్డు ప్రకారం అతడు మైనర్ అని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. అయితే, తాము మున్సిపల్ శాఖ ఇచ్చిన పుట్టినతేదీ ధృవపత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.

Related posts

స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు

Ram Narayana

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు నిరాశ.. విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసిన ధర్మాసనం

Ram Narayana

కవితను జైల్లోనే విచారించేందుకు సీబీఐకి అనుమతి… నిబంధనలు వర్తిస్తాయి!

Ram Narayana

Leave a Comment