Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మాజీ సీఎం కేసీఆర్ అబద్దాలు మాట్లాడటం విడ్డురం …డిప్యూటీ సీఎం భట్టి

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు పోయిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్విట్టర్లో చేసిన ప్రకటన అవాస్తవం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేల తో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండుసార్లు కరెంటు పోయిందని మాజీ సీఎం కేసీఆర్ తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో పేర్కొనడం అవాస్తవం, ఆయన ప్రకటనను ఖండిస్తున్నట్టు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకటనపై స్పందించి స్థానిక ట్రాన్స్కో ఎస్సీ ని విచారణకు ఆదేశించగా ఆయన ప్రకటనలో వాస్తవం లేదని నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. కెసిఆర్ ప్రకటనకు స్పందించి స్థానిక అధికారులతో విచారణ చేయించి వాస్తవాలు నిర్ధారించుకున్నట్లు తెలిపారు.

శనివారం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇంటికి నిరంతర విద్యుత్ సరఫరా జరిగింది, కరెంటు కోత పై శ్రీనివాస్ గౌడ్ పరిసరాల్లోని ఇంటి యజమాలను మా సిబ్బంది విచారించగా ఎటువంటి కోతలు లేవని వారు నిర్ధారించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇంటి సబ్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ లో నమోదు చేసిన రీడింగ్ లోను కరెంటు కోతలు జరగలేదని తేలినట్లు తెలిపారు. సబ్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్ల ద్వారా జరిగే విద్యుత్ సరఫరా డిజిటల్ మీటర్ల ద్వారా ఎవరి ప్రమేయం లేకుండా వాటంతట అవే రీడింగ్ చేస్తాయని.. ఆ డిజిటల్ మీటర్లలోను శనివారం విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఆటంకం ఏర్పడలేదని రికార్డుల ద్వారా స్పష్టమైందని తెలిపారు.

ప్రతిపక్షనేత కేసిఆర్ విద్యుత్ సరఫరా లో అంతరాయంపై ఎటువంటి నిర్ధారణ చేసుకోకుండా ప్రకటనలు చేయడం విచారకరమని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇలాంటి చిల్లర మాటలు చెప్పడం ,అబద్దాలు ఆడటం ఆయనకు తగదని హితవు పలికారు …మాజీ ముఖ్యమంత్రి నిద్ర లేచింది మొదలు అవాస్తవాలు, అభూత కల్పనలతో కాలం గడిపేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల సూర్యాపేట పట్టణంలో సైతం ఇదే తరహాలో విద్యుత్ శాఖను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించి అబాసు పాలయ్యారు. అధికారం చేజారి, బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్ధకంగా మారడంతో అబద్దాలతో, అసత్య ప్రచారాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి చేస్తున్నారు అని డిప్యూటీ సీఎం ఆరోపించారు. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చిన్న చిన్న విషయాల్లో రాజకీయాలు చేస్తూ దొరికిపోవడం చూస్తుంటే తనకు జాలి కలుగుతుందని మాజీ సీఎం కేసీఆర్ తీరు పట్ల డిప్యూటీ సీఎం విచారం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలను చట్ట ప్రకారం ఎదుర్కొంటామని తెలిపారు.

Related posts

నాగార్జున సత్యహరిచంద్రుడు ఏమి కాదు …సిపిఐ నేత నారాయణ విసుర్లు

Ram Narayana

నాపై నమోదైన అక్రమ కేసు కొట్టివేయండి: హైకోర్టులో మల్లారెడ్డి పిటిషన్

Ram Narayana

అమెజాన్‌లో తెలంగాణ యువ‌కుడికి రూ.2 కోట్ల ప్యాకేజీతో జాబ్‌!

Ram Narayana

Leave a Comment