Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

టాప్ క్యాబ్ చైర్మన్, వైస్ చైర్మన్ లు రాజీనామా…

తెలంగాణలో మరో కీలక పరిణామం జరిగింది. టెస్కాబ్ ఛైర్మన్ పదవికి కొండూరి రవీందర్ రావు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం రవీందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ..

సహకార సంఘంలోని కొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తాను పదవిలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు. ఇన్ని రోజులుగా తనకు అండగా ఉన్నవారికి ధన్యావాదాలు తెలిపారు. సహకార సంఘంలో కొంత మంది ఇప్పుటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని.. ఇంకా ఈ పదవిలో కొనసాగలేనని.. అందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు.

కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ.. “2015లో రాష్ట్ర సహకార బ్యాంకు ఆవిర్భావం జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకులో డైరెక్టర్లు పార్టీ మారారు. విశ్వాసం కోల్పోయిన చోట వుండవద్దని నేను నిర్ణయం తీసుకున్నాను. ఛైర్మన్‌గా నేను, వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవులకు రాజీనామా చేస్తున్నాం. గత తొమ్మిది సంవత్సరాలుగా సహకార వ్యవస్థలో ప్రగతి జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడుగా నేను తొమ్మిది సంవత్సరాలుగా వున్నాను. తెలంగాణ సహకార వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అనుసరించాలని నీతి ఆయోగ్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకుకు అనేక అవార్డులు వచ్చాయి. ఈ ప్రభుత్వం విధానాలు అందరికి బాగుండేలా వుండాలి. సహకార వ్యవస్థలో మేము రిటైర్డ్ అధికారులను పెట్టలేదు. నేను నా ఇష్టం వచ్చినట్లు పదవులు ఎవరికి ఇవ్వలేదు వాణీ బాల అంశం బ్యాంకుకు సంబంధం లేదు.” అని ఆయన వెల్లడించారు.

Related posts

మేడిగడ్డపై అధికారులకు ముచ్చెమటలు …పట్టించిన మంత్రి పొంగులేటి…!

Ram Narayana

విద్యార్థుల ప్రేమను చూరగొన్న టీచర్ …

Ram Narayana

హైదరాబాద్ పోలీసులపై మండిపడ్డ డీకే అరుణ

Ram Narayana

Leave a Comment