Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అసెంబ్లీ ఎన్నికలుఆంధ్రప్రదేశ్

నల్గొండలో కుందూరు రఘువీర్ రెడ్డికి 5 లక్షలకు పైగా మెజార్టీ…

  • ఖమ్మం నుంచి 3.5 లక్షల మెజార్టీతో గెలిచిన రఘురాంరెడ్డి
  • 2 లక్షలకు పైగా మెజార్టీతో కొనసాగుతున్న ఈటల రాజేందర్
  • భువనగిరి నుంచి 1.85 లక్షల మెజార్టీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇరుపార్టీలకు చెందిన మెజార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో దూసుకెళుతున్నారు. ఖమ్మం లోక్ సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 3.5 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి అత్యధిక మెజార్టీ దిశగా సాగుతున్నారు. ఆయన మెజార్టీ ఇప్పటికే 5 లక్షలు దాటింది. భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై 1.85 లక్షల మెజార్టీతో ఉన్నారు.

బీజేపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తదితరులు లక్షకు పైగా మెజార్టీతో ఉన్నారు. మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్ 2 లక్షలకు పైగా మెజార్టీతో సాగుతున్నారు. మెదక్ నుంచి రఘునందన్ రావు, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డిలు 30వేల నుంచి 70వేల మెజార్టీతో ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ స్వల్ప మెజార్టీతోనే ఉన్నారు.

Related posts

విశాఖ స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించేందుకు కేంద్రం కొత్త ప్లాన్!

Ram Narayana

సికింద్రాబాద్ కాల్పుల ఘ‌ట‌న‌పై పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే..?

Drukpadam

A $1495 Flamingo Dress: The Pink Bird Is Dominating Fashion

Drukpadam

Leave a Comment