ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్… అభినందనల వర్షం

  • ఏపీలో టీడీపీ కూటమి సంచలన విజయాలు
  • అద్భుతంగా విజయాలు సాధించారంటూ చంద్రబాబును అభినందించిన మోదీ
  • ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం పట్ల శుభాకాంక్షలు 

ఏపీలో టీడీపీ కూటమి సునామీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. 

ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన ఏపీలో అద్భుత విజయాలు సాధిస్తుండడం పట్ల మోదీ… చంద్రబాబుపై అభినందనల వర్షం కురిపించారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం పట్ల చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ క్రమంలో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి అభినందించారు. మరిన్ని లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.

Related posts

ఎమ్మెల్సీగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది జనసేన ఎమ్మెల్యేల సంతకాలు!

Ram Narayana

మండలి ప్రతిపక్ష నేత పదవికి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా!

Ram Narayana

తప్పు చేసినవారిని వదిలిపెట్టబోను.. చంద్రబాబు వార్నింగ్..

Ram Narayana