Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ప్రధాని పదవిని ఆఫర్ చేసింది, కానీ…: జేడీయూ

  • నితీశ్ కుమార్ ఆఫర్‌ను తిరస్కరించారన్న జేడీయూ
  • ప్రస్తుతం తాము ఎన్డీయేలోనే కొనసాగుతున్నట్లు స్పష్టీకరణ
  • జేడీయూ నేత త్యాగి వెల్లడి

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ప్రధాని పదవిని ఆఫర్ చేసినట్లుగా జేడీయూ వర్గాలు వెల్లడించాయి. అయితే నితీశ్ కుమార్ ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

నితీశ్ కుమార్‌కు ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందని, ఆయన మాత్రం తిరస్కరించారని తెలిపారు. ఈ విషయమై ఇండియా కూటమి నేతలు… తమ అధినేతను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ ప్రస్తుతం తాము ఎన్డీయేలో ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. త్యాగి వ్యాఖ్యలను ఖండించింది. నితీశ్‌ను ప్రధానిగా చేసేందుకు ఇండి కూటమి సంప్రదించడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. ఈ విషయం గురించి కేవలం ఆయనకు మాత్రమే తెలుసునని చురక అంటించింది.

Related posts

272 సీట్లు గెలవకుంటే బీజేపీ వద్ద ప్లాన్ ‘బీ’ ఉందా? అని అడిగితే అమిత్ షా సమాధానం ఇదీ…!

Ram Narayana

ముందు మీ అవినీతి చూసుకోండని కేసీఆర్ పై మధ్యప్రదేశ్ సీఎం చౌవాన్ ఫైర్ …

Ram Narayana

తాను ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పిన ప్రియాంక గాంధీ..!

Ram Narayana

Leave a Comment