Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

పూరీ ఆలయంలోని రహస్య గదిని తెరిచిన ఒడిశా ప్రభుత్వం…

  • దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పూరీ ఆలయానికి గుర్తింపు
  • పూరీ ఆలయంలోని రత్న భాండాగారంపై సర్వత్రా ఆసక్తి
  • ఆలయ వర్గాలు, అధికారుల పర్యవేక్షణలో తెరుచుకున్న రహస్య గది తలుపులు
  • లెక్కింపు చేపట్టనున్న 16 మంది సభ్యుల కమిటీ

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయంలో రహస్య గది (రత్న భాండాగారం) తెరుచుకుంది. ఒడిశా ప్రభుత్వం నేడు ఈ రహస్య గదిని తెరిచింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ ఓ ప్రకటనలో తెలిపారు. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీ ఈ రత్న భాండాగారంలోని సంపదను లెక్కించనుంది. 

46 ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథ ఆలయంలో రహస్య గది తలుపులు తెరుచుకోవడం, నిధి లెక్కింపుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గతంలో కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిధిపై ఇదే రీతిలో ఉత్కంఠ నెలకొనడం తెలిసిందే. 

కాగా, పూరీ ఆలయంలో జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా, ఈ రహస్య గదిని తెరిచారు. చివరిసారిగా 1978లో ఈ రత్న భాండాగారాన్ని తెరిచారు. అప్పట్లో 70 రోజుల పాటు అందులోని సంపదను లెక్కించారు.

Related posts

అధికారం ఉందని లోక్ సభలో బీజేపీ ఆటలాడుతోంది: కాంగ్రెస్ ఎంపీ

Ram Narayana

తెరుచుకునున్న కేదార్‌నాథ్‌ ఆలయం…

Ram Narayana

ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్ లలో భద్రతా లోపాలను గుర్తించిన కేంద్రం

Ram Narayana

Leave a Comment