తెల్లం వెంకట్రావు ఎక్కడకు వెళ్ళరు… అభద్రతా భావంలో బీఆర్ యస్ …మంత్రి పొంగులేటి
ఎమ్మెల్యేలు ఎవరు బీఆర్ యస్ వైపు ఎవరు వెళ్లడం లేదు …
బీఆర్ యస్ ప్రచారం చేసుకుంటుంది
తమ దగ్గర ప్రేమ ఉంది …అందరిని ఇబ్బంది లేకుండా చూసుకుంటాం
ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదని.. అదంతా గులాబీ నేతలు చేసుకుంటున్నా ప్రచారమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఎక్కడికి పోరని తేల్చిచెప్పారు. మంగళవారం నాడు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. పాత పరిచయం కాబట్టి కలసి ఉంటారని అన్నారు. తమ దగ్గరకి వచ్చిన నేతలు ఎవరు ఇబ్బంది కలగకుండా ఉంటారని చెప్పారు. తమ దగ్గర ప్రేమ రాజకీయాలు ఉంటాయని అన్నారు. ఎవరు ఎక్కడికి పోరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ యస్ కు చెందిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ యస్ నుంచి ఇటీవలనే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు …అయితే ఆయన నేడు కేటీఆర్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది …ఈ నేపథ్యంలో బీఆర్ యస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి పొంగులేటినిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు …దీనిపై ఆయన పై విధంగా స్పందించారు …తమ వైపుకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కడకు పోరని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు ..