Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్!

  • సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ కు ఊరట 
  • సెప్టెంబర్ 3 నుండి 25 వరకూ జగన్ యూకే పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
  • పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు, మొబైల్ నంబర్, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని చెప్పిన న్యాయస్థానం

అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు ఆయనకు అనుమతి నిచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీ నుండి 25వ తేదీ వరకూ యూకేలో ఉన్న తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు గానూ అనుమతి కోరుతూ వైఎస్ జగన్ ..15 రోజుల క్రితం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ పై విచారణ సందర్భంలో జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ అభ్యంతరం తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే సీబీఐ కోర్టు .. జగన్ కు షరతులతో విదేశీ పర్యటనకు అనుమతి నిచ్చింది. యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబర్, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదే క్రమంలో జగన్ కు ఐదేళ్ల కాలపరిమితితో కొత్త పాస్ పోర్టు జారీకి కూడా సీబీఐ కోర్టు అనుమతి నిచ్చింది.

Related posts

ముఖ్యమంత్రుల భేటీపై రేవంత్ రెడ్డికి సీపీఐ నారాయణ హెచ్చరిక!

Ram Narayana

శనివారం తిరుమలలో పోటెత్తిన భక్తులు…దర్శనానికి 20 గంటలపైనే సమయం

Ram Narayana

టీడీపీ ప్రధాన కార్యాలయానికి సీఐడీ నోటీసులు

Ram Narayana

Leave a Comment