Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సీతారాం ఏచూరి సంస్మరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి , బీఆర్ యస్ నేత కేటీఆర్

ఇటీవల మరణించిన సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారామ ఏచూరి సంస్మరణసభకు సీఎం రేవంత్ రెడ్డి , బీఆర్ యస్ నేత మాజీమంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు …సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న ఈసభకు హాజరు కావాలని వివిధ పార్టీల నేతలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆహ్వానించారు …ఆయన ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి , కేటీఆర్ పాల్గొన బోతున్నారు ..రోజు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఒకే వేదికను పంచుకోనుండటంతో ఆసక్తి నెలకొన్నది …


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ నెల 21 న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న ఏచూరి సంస్మరణ సభకు ఈ నేతలు ఇద్దరూ హాజరుకానున్నారు. దీంతో వారిద్దరి భేటీ ఎలా ఉండబోతోంది.. వారు ఎలా పలకరించుకుంటారనే విషయంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత సమయం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ.. ఆ తర్వాత హామీల అమలుకు సంబంధించి ఎక్కడికక్కడ నిలదీస్తోంది. ఆరు గ్యారంటీలు సహా కాంగ్రెస్ హామీలన్నీ అమలులో విఫలమైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ దాదాపుగా రోజూ విమర్శలు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నార

వివిధ కార్యక్రమాలలో సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా నిలదీస్తూ, పదునైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే దీటుగా ప్రతి విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ ల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాల ఏర్పాటుపై ట్వీట్లు, కౌంటర్ ట్వీట్లతో విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి భేటీపై రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులలోనూ ఆసక్తి నెలకొంది. కాగా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నెల 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం పార్టీ ఏచూరి సంస్మరణ సభ నిర్వహించనుంది. ఈ సభకు హాజరుకావాలంటూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అటు కేటీఆర్ ను సీపీఎం నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వారిరువురూ హాజరవుతున్నట్లు సమాచారం.

Related posts

తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా…

Ram Narayana

ఢిల్లీలో గల్లీల్లో కేటీఆర్ ప్రదక్షిణలు అందుకే: రేవంత్‌రెడ్డి

Drukpadam

రేవంత్ ఆలా …కేటీఆర్ ఇలా …రేవంత్ ఉచిత విద్యత్ మాటలపై రాజకీయ దుమారం…

Drukpadam

Leave a Comment