Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ముంబైలో ఎన్సీపీ నేత హత్య…

  • పదునైన ఆయుధంతో పొడిచి చంపిన దుండగులు
  • శుక్రవారం అర్ధరాత్రి బైకుల్లా ప్రాంతంలో ఘటన
  • ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయారన్న పోలీసులు

మహారాష్ట్రలోని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత సచిన్ కుర్మీ హత్యకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి బైకుల్లా ప్రాంతంలో దుండగులు ఆయనపై పదునైన ఆయుధంతో దాడి చేశారు. పలుమార్లు పొడిచి పారిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్న సచిన్ కుర్మీని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సచిన్ చనిపోయారని వైద్యులు ప్రకటించారు.

ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ హత్య జరిగింది. సచిన్ కుర్మీ ప్రస్తుతం ఎన్సీపీ బైకుల్లా అధ్యక్షుడిగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన హత్యపై తీవ్రంగా మండిపడుతున్నారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సచిన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హంతకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, సచిన్ కుర్మీ హత్యను ఎన్సీపీ ముంబై అధ్యక్షుడు సమీర్ భుజ్ బల్ తీవ్రంగా ఖండించారు. సచిన్ మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Related posts

బైకర్‌ను ఢీకొట్టి 30 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డిప్యూటీ తహసీల్దార్ కారు!

Ram Narayana

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఎనిమిది మంది మృతి!

Drukpadam

ఖమ్మం లో చర్చ్ కంపౌండ్ బ్రిడ్జి పై మొండం నుంచి వేరైనా తల కలకలం…

Drukpadam

Leave a Comment