Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు…

నాగార్జున విషయాలన్నీ బయటకు తీస్తున్నాం: కొండా సురేఖ లాయర్

  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శ
  • నాగార్జునపై చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ వెనక్కి తీసుకున్నారని వెల్లడి
  • ఆర్టీఐ ద్వారా నాగార్జున విషయాలు బయటకు లాగుతున్నామన్న లాయర్

ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసినందుకు నాగార్జున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనపై కూడా తాము పరువునష్టం దావా వేస్తామని కొండా సురేఖ తరఫు న్యాయవాది తెలిపారు. అఫైర్ల గురించి కేటీఆర్, కేసీఆర్‌కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు.

నాంపల్లి కోర్టు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొండా సురేఖ మెదక్ ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గౌరవసూచకంగా ఆమె మెడలో నూలు వస్త్రాన్ని కప్పారని, కానీ దీనిని బీఆర్ఎస్ సోషల్ మీడియా అనుచితంగా చూపించిందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఎన్నో విషయాలు వెలుగు చూశాయన్నారు.

నాగచైతన్య, సమంత విషయంలో నాగార్జున గురించి మాట్లాడిన కొండా సురేఖ ఆ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. బీసీ మంత్రి కొండా సురేఖపై, ప్రభుత్వంపై బురదజల్లే ఉద్దేశంతో నాగార్జున పరువునష్టం దావా వేశారని ఆరోపించారు. నాగార్జున వేసిన కేసులో ఏమీలేదన్నారు.

నాగార్జున విషయాలను బయటకు తీస్తున్నాం

నాగార్జున వేసిన పరువునష్టం దావా కేసులో వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసిందన్నారు. టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన తాము నాగార్జునకు సంబంధించిన అన్ని విషయాలను ఆర్టీఐ ద్వారా బయటకు తీస్తున్నామన్నారు. ఆ తర్వాత నాగార్జునపై తాము పరువునష్టం కేసు వేస్తామన్నారు.

Related posts

చంద్రబాబు బెయిల్ పిటిషన్.. నాట్ బిఫోర్ మీ అన్న హైకోర్టు న్యాయమూర్తి

Ram Narayana

సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ పాత్ర తొలగింపు చట్టంపై… స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు!

Ram Narayana

జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురికి జీవితఖైదు

Ram Narayana

Leave a Comment