తమ యూనియన్ పై అభ్యంతరకర పోస్టింగ్ ల పై ఖమ్మం నగర ఏసిపి కి ఫిర్యాదు
శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం
తమ యూనియన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం
తక్షణ చర్యలు తీసుకోండి టీయూడబ్ల్యూజే (ఐజేయు)
అభ్యంతరకర పోస్టింగ్లు పెడుతూ మా యూనియన్ నేతలపై దుష్ప్రచారం చేస్తున్న గుద్దేటి రమేష్ అనే వ్యక్తిపై చట్టారీత్యా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ టియుడబ్ల్యూజె (ఐజయు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు , ఏనుగు వెంకటేశ్వరరావు ఆధ్వరంలో మంగళవారం స్థానిక ఏసిపి రమణమూర్తికి ఫిర్యాదు చేశారు . 67 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి అనేక ఉద్యమాలు నడిపిన సంఘంపై అమర్యాదగా ప్రవర్తిస్తే సహించేది లేదని అన్నారు … జర్నలిస్టుల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తూ ఇల్లు ,ఇళ్లస్థలాలు , అక్రిడేషన్ కార్డులు , హెల్త్ కార్డులు , ఇన్సూరెన్స్ పథకం , వేతన సంఘం సిపార్సుల అమలుకు కృషి చేసిన సంఘం ఏదైనా ఉందంటే అదే టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) నేని అలాంటి సంఘం ప్రతిష్ట దిగజార్చే విధంగా ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని వారు హెచ్చరించారు …సోషల్ మీడియాలో అనవసర పోస్టింగ్ పెట్టడం మనుకునేలా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు ఏసీపీని కోరారు ..
ఎవరి సంఘం వారి ఇష్టం …ఒక సంఘం మరో సంఘంపై అసత్య ప్రచారం చేస్తూ అదే పనిగా పెట్టుకొని ఊరేగటం మంచి సంస్కృతీ కాదని హితవు పలికారు ..ఇప్పటివరకు రాష్ట్రంలో జర్నలిస్టులకు మేలు జరిగిందంటే, అంతకు ముందు ఉన్న ఏపీయూడబ్ల్యూజే, రాష్ట్ర విడిపోయిన తర్వాత టీయూడబ్ల్యూజే ద్వారానే సాధ్యమనే విషయం జర్నలిస్ట్ సమాజనానికి తెలియంది కాదని వారు అన్నారు ..ఇటీవలనే హైద్రాబాద్ లో 17 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 1100 మందికి చెందిన జవర్ లాల్ నెహ్రు హోసింగ్ సొసైటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ,రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఒప్పించి వారికీ స్థలం ఇప్పించిన ఘనత మీడియా అకాడమీ చైర్మెన్ కె .శ్రీనివాస్ రెడ్డి గారిది యూనియన్ దే అని వారు గుర్తు చేశారు …
టియుడబ్ల్యూజె (ఐజెయు) ప్రభుత్వ గుర్తింపు పొందిందని ఇటీవల స్వయం ప్రకటిత ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఉన్న గుద్దేటి రమేష్ మా యూనియన్ పైన, మా యూనియన్ నేతలపైనా ,స్థంభాద్రి హౌజింగ్ సొసైటీ బాధ్యులపైనా సోషల్ మీడియా గ్రూపుల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు . జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలను దూషించడం, మా కర్తవ్యాలను ప్రశ్నించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని తనకు సంబంధం లేని అనవసర విషయాలపై జోక్యం చేసుకుంటూ తన పోస్టింగ్లో బెదిదింపులకు పాల్పడుతున్నారని వారు ఫిర్యాదులో తెలిపారు . బడితెపూజలు చేస్తాం ,దిష్టిబొమ్మను తగలబెడతాం, చావుడప్పును మ్రోగిస్తామంటూ హెచ్చరించడంతో పాటు మూర్ఖులు, దుష్టులు అంటూ వ్యక్తిగత నిందారోపణలకు పాల్పడ్డారని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు . సహనం పాటించే కొద్ది మరింతగా రెచ్చిపోయి మా యూనియన్ అంతర్గత విషయాలను కూడా ప్రస్తావిస్తూ యూనియన్ నష్టం చేయడంతో పాటు యూనియన్ నేతల ప్రతిష్టను దిగజార్చేవిధంగా వ్యవహరిస్తున్నారని వ్యక్తులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. పై విషయాలపై విచారణ జరిపి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు … ఫిర్యాదును స్వీకరించిన ఏసిపి రమణమూర్తి తగు చర్యలు తీసుకుంటామని ఐజెయు నేతలకు హామీ నిచ్చారు.
ఫిర్యాదు చేసిన వారిలో టి యు డబ్ల్యూ జే ఐ జే యు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్, జిల్లాఅధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు ,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు ఎ ఖదీర్, నగర అధ్యక్ష, కార్యదర్యులు వైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి శివానంద, ప్రెస్ క్లబ్ కార్యదర్శి కూరాకుల గోపి, కోశాధికారి నామ పురుపోత్తం, నాయకులు , జనార్ధనాచారి, వేణుగోపాల్, సాగర్, నాగేందర్రెడ్డి, కళ్యాణ్, కె. వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.