Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల ఇండ్లస్థలాలను వెనక్కి తీసుకోవడంపై కేటీఆర్‌ ఆగ్రహం!

జర్నలిస్టుల ఇండ్లస్థలాలను వెనక్కి తీసుకోవడంపై కేటీఆర్‌ ఆగ్రహం

కరీనంగర్‌లో జర్నలిస్ట్‌లకు కేటాయించిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకోవటంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్ట్‌లకు ప్రభుత్వం స్థలాలను కేటాయించటాన్ని కూడా రేవంత్‌రెడ్డి సర్కార్‌ జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో పేద ప్రజల ఇండ్లను కూలగొడుతున్నదని విమర్శించారు. కరీంనగర్‌లో జర్నలిస్ట్‌ల స్థలాలను వెనక్కి తీసుకుంటున్నదని తెలిపారు. అసలు ఇదేం పాలనంటూ ప్రశ్నించారు. జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం వారికి కేటాయించిన స్థలాలను రద్దు చేయటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే జర్నలిస్ట్‌లపై కక్ష గట్టి ఈ చర్యకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు.

Related posts

ఏపీ పరిషత్ ఎన్నికలపై స్టే…

Drukpadam

Las Catrinas Brings Authentic Mexican Food to Astoria

Drukpadam

ఐరాస్ చీఫ్ కీవ్ వీధుల్లో పర్యటిస్తున్న సమయంలో అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాం: రష్యా వెల్లడి

Drukpadam

Leave a Comment