Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన!

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధానంగా సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆ సమావేశ అనంతరం.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ప్రత్యేక సమావేశం అయ్యారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద నష్టంపై కేంద్రం కేటాయించిన వరద సహాయాన్ని మరింత పెంచాలని అమిత్ షాను కోరారు. అలాగే విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని, మరింత మంది ఐఏఎస్ లను రాష్ట్రానికి కేటాయించాలని కూడ సీఎం అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఇక ఖట్టర్ తో జరిగిన సమావేశంలో.. హైదరాబాద్ నగరంలో మురుగు నీటి శుద్దీకరణకు నిధులు విడుదల చేయాలని, మెట్రో రెండో దశ పనులకు అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. ఏపీ సీఎం చంద్రబాబు తో మాటామంతి కానిచ్చారు … కాగా రెండు రోజుల హస్తిన పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు .

Related posts

ప్రజలను, ప్రజాసంఘాలను ఆలోచింప చేస్తున్న టీయూడబ్ల్యూజే ఖమ్మం రాష్ట్ర మహాసభలు !

Ram Narayana

మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసింది …మందా కృష్ణమాదిగ ధ్వజం

Ram Narayana

స్వలాభం కోసమే కందాల పార్టీ మారారు…కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో .చైర్మన్ పొంగులేటి

Ram Narayana

Leave a Comment