Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రతన్ టాటా మరణం పట్ల – మాజీ ఎంపీ నామ సంతాపం

భారతదేశం దిగ్గజ పారిశ్రామికవేత్త మరియు గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పట్ల మాజీ ఎంపీ నామ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు . భారతదేశ పారిశ్రామిక రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారని, సామాజిక సేవలో ఆయనే యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచారని నామ పేర్కొన్నారు. రతన్ టాటా వ్యాపార అభివృద్దే కాకుండా, సామాజిక స్పృహతో కూడిన వ్యాపార విధానాలను తీసుకువచ్చారని, ఎంతోమంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచారని నామ అభిప్రాయపడ్డారు. పేద, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి అమూల్యమని, ఆయనకు ఉన్న నిబద్ధత భారతీయ యువతకు ఓ పాఠమని పేర్కొన్నారు.

రతన్ టాటా, టాటా గ్రూప్ చైర్మన్‌గా దేశంలో వ్యాపార రంగానికి మాత్రమే కాకుండా, సామాజిక సేవలోనూ గొప్ప మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన ఆధ్వర్యంలో టాటా గ్రూప్ ఎన్నో విస్తృత కార్యక్రమాలను చేపట్టి పేదలకు సేవలందించింది. టాటా ట్రస్ట్‌ల ద్వారా ఆయన పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల్లో ఎంతో సహకారం అందించారన్నారు. రతన్ టాటా మరణం భారత పారిశ్రామిక రంగానికి, దేశానికి తీరని లోటన్నారు. ఆయన ఆలోచనలు, విశ్వాసాలు నేటి పారిశ్రామిక సమాజానికి, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయిన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి భగవంతున్ని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను అని నామ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts

నడుస్తూ సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్యే సీతక్క… ఆసుపత్రికి తరలింపు

Drukpadam

ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ శ్రీనివాసరావు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి!

Drukpadam

అలాస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ…

Drukpadam

Leave a Comment