- కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసుల దాడులు
- ఏడు లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్న ఎక్సైజ్ సీఐ
- ఈ కేసులో రాజ్ పాకాల ఏ2గా ఉన్నారని వెల్లడి
జన్వాడ ఫాంహౌస్ పై దాడులు జరిగిన అనంతరం రాజ్ పాకాల పరారీలో ఉన్నారని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ లో పార్టీ నిర్వహించారని, 7 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, అందులో కర్ణాటక మద్యంతో పాటు విదేశీ లిక్కర్ కూడా ఉందని ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు.
ఈ కేసులో ఏ1గా ఫాంహౌస్ సూపర్ వైజర్ కార్తీక్, ఏ2గా రాజ్ పాకాల ఉన్నారని వివరించారు. దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే మరికొన్ని విషయాలు వెల్లడవుతాయని తెలిపారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై గతరాత్రి పోలీసులు దాడులు చేపట్టడం తెలిసిందే.