Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఆస్ట్రేలియా ప్ర‌ధానికి కోహ్లీ ఫ‌న్నీ కౌంట‌ర్‌.. నెటిజ‌న్ల ఫిదా.. !

  • గురువారం ఆసీస్ ప్ర‌ధాని ఆంథోనీ అల్బ‌నీస్‌ను క‌లిసిన భార‌త క్రికెట‌ర్లు
  • ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని, విరాట్ కోహ్లీకి మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ
  • ప్ర‌ధానికి కోహ్లీ ఫ‌న్నీ కౌంట‌ర్‌తో చిరు న‌వ్వులు చిందించిన తోటి క్రికెట‌ర్లు

ఆస్ట్రేలియా ప్ర‌ధాని ఆంథోనీ అల్బ‌నీస్‌ను గురువారం టీమిండియా క్రికెట‌ర్లు క‌లిసిన‌ విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా భార‌త ప్లేయ‌ర్ల‌తో ఆసీస్ ప్ర‌ధాని ముచ్చ‌టించారు. ఒక్కొక్క‌రిని ప‌రిచ‌యం చేసుకుంటూ స‌ర‌దాగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు, విరాట్ కోహ్లీకి మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ న‌డిచింది. 

“ఎలా ఉన్నారు, పెర్త్‌లో బాగా ఆడారు. ఆల్రెడీ మా జ‌ట్టు ఇబ్బందుల్లో ఉంటే అది స‌రిపోద‌న్న‌ట్లు మీరు సెంచ‌రీ చేశారు” అని ప్ర‌ధాని అన్నారు. అందుకు స్పందించిన విరాట్‌ కోహ్లీ.. “మీరు కొంచెం మ‌సాలా క‌ల‌పదానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటారు” అంటూ ఫ‌న్నీగా బ‌దులిచ్చాడు. ఈ ఫ‌న్నీ కౌంట‌ర్‌కు తోటి ఆట‌గాళ్లు చిరున‌వ్వులు చిందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. కోహ్లీ ఫ‌న్నీగా బ‌దులిచ్చిన తీరుకు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. 

కాగా, రేప‌టి నుంచి కాన్‌బెర్రా వేదిక‌గా ప్రైమ్ మినిస్ట‌ర్ ఎలెవ‌న్‌తో భార‌త జ‌ట్టు వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌నుంది. ఈ క్ర‌మంలోనే టీమిండియా ప్లేయ‌ర్లు ప్ర‌ధాని ఆంథోనీ అల్బ‌నీస్‌తో స‌మావేశ‌మ‌య్యారు. అలాగే భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆ దేశ పార్ల‌మెంట్‌లో కూడా ప్ర‌సంగించ‌డం జ‌రిగింది. ఇక బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా డిసెంబ‌ర్ 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు (డే అండ్ నైట్) జ‌ర‌గ‌నుంది. ఐదు మ్యాచ్‌ల బీజీటీ సిరీస్‌లో ఇప్ప‌టికే టీమిండియా తొలి టెస్టులో విజ‌యంతో 1-0తో ఆధిక్యంలో ఉంది.  

Related posts

ముగిసిన ఒలింపిక్స్.. టాప్‌లో అమెరికా ..71 స్థానంలో భారత్ …

Ram Narayana

భూమిని తాకిన శక్తిమంతమైన సౌర తుపాను…

Ram Narayana

యూఏఈలో లక్కీ డ్రాలో రూ.45 కోట్లు గెలుచుకున్న భారతీయుడు.. అతడి స్పందన ఏంటంటే..!

Ram Narayana

Leave a Comment