- నిన్న కన్నియాకుమారికి వెళ్లిన రేవంత్ రెడ్డి
- కన్నియాకుమారి ఎంపీ విజయ్ ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లిన సీఎం
- అక్కడ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం తమిళనాడులోని కన్నియాకుమారికి వెళ్లారు. తిరువనంతపురం మీదుగా ఆయన కన్నియాకుమారికి చేరుకున్నారు. స్థానిక ఎంపీ విజయ్ ఆహ్వానం మేరకు క్రిస్మస్ వేడుకలకు ఆయన వెళ్లారు. నిన్న క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నిన్న రాత్రి ఆయన కన్నియాకుమారిలోనే బస చేశారు. రేవంత్ పర్యటన నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం ఆయన హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యారు. రేవంత్ రెడ్డి వెంట డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు.