Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు!

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
-ఢిల్లీ అల్లర్ల కేసులో ముగ్గురుకి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
-చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం గురించి హైకోర్టు చర్చించడం ఇబ్బందికరంగా ఉందన్న సుప్రీం
-ఈ తీర్పును ఇతర న్యాయస్థానాలు అనుసరించరాదని ఆదేశం
-ఈ చట్టం గురించి తామే వివరించాల్సి ఉందని వ్యాఖ్య

ఢిల్లీ అల్లర్ల కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. బెయిల్ పిటిషన్ విచారణలో ఎవరూ కోరకుండానే చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం గురించి చర్చించడం ఇబ్బందికరంగా ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ చట్టం గురించి వివరించడం వల్ల దేశవ్యాప్తంగా పర్యవసానాలు ఉంటాయని… ఈ చట్టం గురించి తామే వివరించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఢిల్లీలోని జేఎన్యూ, జామియా విద్యా సంస్థల విద్యార్థులు నటాషా, దేవాంగన, ఆసిఫ్ లకు ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఈ అప్పీళ్లపై విచారణ జరిపేందుకు మాత్రం అంగీకరించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ముగ్గుర్నీ ఆదేశించింది. ఈ ముగ్గురుకీ బెయిల్ మంజూరు చేసిన తీర్పును భవిష్యత్తులో ఇతర న్యాయస్థానాలు అనుసరించరాదని ఆదేశించింది. ముగ్గురు విద్యార్థుల తరపున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

సంచలనంగా మారిన ఈ బెయిల్ తీర్పు పై సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీం ఎలాంటి తీర్పు దీనిపై ఇస్తుందనే దానిపై న్యాయనిపుణుల్లో ఆశక్తి నెలకొన్నది

Related posts

పవన్ కల్యాణ్ కు ఓటేయాలని ఏపీలో ఎవరూ అనుకోవడంలేదు: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

Ram Narayana

లండన్ లో ఇంటి అద్దె నెలకు రూ.2.5 లక్షలు!

Drukpadam

కొవిషీల్డ్ టీకాతో 80% తగ్గుతున్న కరోనా మరణాల ముప్పు!

Drukpadam

Leave a Comment