Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

42 మంది కార్మికులను చిదిమేసిన బంగారు గని…

  • ఆఫ్రికా దేశం మాలిలో దుర్ఘటన
  • ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు
  • తప్పించుకునేలోపే మృత్యువాత పడిన కార్మికులు

ఓ బంగారు గని కుప్పకూలిన ఘటన ఆఫ్రికా దేశం మాలిలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 42 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మాలి దేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఈ గని కొందరు చైనా జాతీయులు నిర్వహణలో ఉంది. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు. 

కొన్ని రోజుల వ్యవధిలోనే మాలి దేశంలో జరిగిన రెండో ప్రమాదం ఇది. గత నెల 29న కౌలికోరో ప్రాంతంలో ఉన్న ఓ బంగారు గని కూలిపోయిన ఘటనలోనూ ప్రాణనష్టం జరిగింది. 

మాలి దేశం ఆఫ్రికాలోని మూడో అతి పెద్ద బంగారం ఉత్పత్తిదారుగా ఉంది. ఇక్కడి జనాభాలో 10 శాతం కంటే ఎక్కువమంది గనులపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నారు. గతేడాది కూడా మాలిలో ఓ బంగారు గని కుప్పకూలి 70 మంది మృత్యువాతపడ్డారు. ఇక్కడి గనుల్లో చాలా వరకు అనుమతులు లేనివే ఉంటాయని తెలుస్తోంది.

Related posts

కొరియా విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ వ్యక్తి స్పృహ వచ్చాక ఏం చెప్పాడంటే..!

Ram Narayana

అమెరికాలో అరుదైన హిందూ దేవాలయం…!

Ram Narayana

స్కూల్ లోకి టీచర్లు తుపాకులు తీసుకెళ్లొచ్చట.. బిల్ పాస్ చేసిన అమెరికాలోని టెన్నెస్సీ హౌస్

Ram Narayana

Leave a Comment