Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
బిజినెస్ వార్తలు

ఎస్ బీఐ కొత్త మ్యూచువల్ ఫండ్… రూ.250 నుంచి సిప్ ప్రారంభం…

  • జన్ నివేష్ పేరుతో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ)ని లాంఛ్ చేసిన ఎస్బీఐ
  • రూ.250 సేవింగ్ తో రూ.4 లక్షల రాబడి
  • ఈ పథకం ద్వారా ఎటువంటి లావాదేవీ రుసుములు వసూలు చేయమన్న ఎస్బీఐ

మ్యూచువల్ ఫండ్స్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు ఎస్‌బీఐ నూతన పథకాన్ని ప్రారంభించింది. ‘జన్ నివేశ్’ పేరుతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా కేవలం రూ.250తో పెట్టుబడి పెట్టుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎటువంటి లావాదేవీ రుసుములు వసూలు చేయబోమని సంస్థ స్పష్టం చేసింది.

ఇంతకు ముందు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.500తో ప్రారంభించాల్సి ఉండేది. దానిని ఇప్పుడు వీధి వ్యాపారులు, చిన్న స్థాయి ఉద్యోగులు వంటి పేద వర్గాల ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సిప్ ఎంపిక చేసుకున్న వారు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే వారికి ఆర్థిక భరోసా లభించనుంది.

ఈ పథకం ద్వారా ఎంత రాబడి వస్తుందంటే.. నెలకు రూ.250 చొప్పున 25 సంవత్సరాల పాటు పొదుపు చేస్తే, వారికి లభించే మొత్తం రూ.4,74,409 అవుతుంది. ఇందులో వారు చెల్లించేది రూ.75 వేలు మాత్రమే కాగా, వారికి వచ్చే మొత్తం రూ.4 లక్షలకు పైగా ఉంటుంది. ఈ క్రమంలో వడ్డీ రూపంలోనే దాదాపు రూ.4 లక్షలు పొందవచ్చు. 

Related posts

ఏటీఎం సేవలు మరింత ప్రియం… మే 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధ‌న‌లు!

Ram Narayana

డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లు…వరుసగా పదో నెల రూ.1.7 లక్షల కోట్లు క్రాస్!

Ram Narayana

గౌతమ్ అదానీపై రూ.2,236 కోట్ల లంచం ఆరోపణలు.. అమెరికాలో కేసు, అరెస్ట్ వారెంట్ జారీ!

Ram Narayana

Leave a Comment