Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఇండియాలో ఎలాన్ మస్క్ ప్రణాళికలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

  • ఇండియాలో అడుగుపెట్టబోతున్న టెస్లా
  • మస్క్ నిర్ణయం అన్యాయమన్న డొనాల్డ్ ట్రంప్
  • తమ దేశాన్ని వాడుకోవడానికి ప్రతి దేశం ప్రయత్నిస్తోందని వ్యాఖ్య

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన దిగ్గజ ఈవీ కంపెనీ టెస్లా భారత్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ వాహనాల తయారీ యూనిట్ ను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది. ఇండియాలో షోరూంల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఫ్యాక్టరీ పెట్టాలన్న మస్క్ నిర్ణయం అన్యాయమని అన్నారు. మస్క్ పక్కన ఉండగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

ట్రంప్, మస్క్ ఇద్దరూ కలిసి ఫాక్స్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్ లోకి టెస్లా ఎంట్రీ ప్రణాళికలపై ట్రంప్ మాట్లాడుతూ… తమ దేశాన్ని వాడుకోవడానికి ప్రపంచంలోని ప్రతి దేశం ప్రయత్నిస్తోందని అన్నారు. సుంకాలతో తమ నుంచి లబ్ధి పొందాలని భావిస్తున్నారని చెప్పారు. దీంతో, ఎలాన్ మస్క్ తన కార్లను అమ్ముకోవడం కష్టతరంగా మారుతోందని అన్నారు. దీనికి ఉదాహరణ ఇండియానే అని… ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఆయన భారత్ లో ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారని చెప్పారు. మస్క్ వరకు ఇది మంచి నిర్ణయమే కావచ్చని… కానీ అమెరికా పరంగా చూస్తే ఇది అన్యాయమైన నిర్ణయమని తెలిపారు.

Related posts

దక్షిణ కొరియా అధ్యక్షుడికి బిగ్ షాక్.. అరెస్ట్ వారెంట్

Ram Narayana

భారత్ ఎమర్జెన్సీ విమాన సర్వీసుకు మాల్దీవులలో అనుమతి నిరాకరణ.. 14 ఏళ్ల బాలుడు మృతి

Ram Narayana

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం ….

Ram Narayana

Leave a Comment