Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థివదేహానికి నివాళి అర్పించిన జగన్…!

  • నిన్న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సుబ్బారెడ్డి మాతృమూర్తి
  • మేదరమెట్లలోని సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లిన జగన్
  • సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్

వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ నిన్న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె వయసు 85 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె… ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పిచ్చమ్మ పార్థివదేహానికి వైసీపీ అధినేత జగన్ నివాళి అర్పించారు. 

బాపట్ల జిల్లా మేదరమెట్లలోని సుబ్బారెడ్డి నివాసానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించి, వైవీ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియల్లో జగన్ పాల్గొనబోతున్నారు.

Related posts

మే 10న జర్నలిస్ట్ ల సమస్యలపై ఐజేయూ నిరసన

Drukpadam

ప్రజలు ఆహుతైపోతారు.. గుజరాత్​ సర్కార్​ నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

Drukpadam

కమలా హారిస్ ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన యూఎస్ నర్స్… అరెస్ట్

Drukpadam

Leave a Comment