- 61 మందితో నూతన కమిటీ
- 15 మందితో కార్యదర్శి వర్గం
ఎస్ఎఫ్ఐ ఐదవ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో ఆదివారం ముగిశాయి. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రం సీతారాం ఏచూరి నగర్ లో మూడు రోజులపాటు నిర్వహించిన మహాసభల్లో రాబోయే రెండున్నర సంవత్సరాల కోసం 61 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా రజనీకాంత్ (కరీంనగర్), టి. నాగరాజు (ఖమ్మం) ఎన్నికయ్యారు. వీరితో కలిపి మొత్తం 15 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షులుగా ఏడుగురు, సహాయ కార్యదర్శులుగా ఆరుగురు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారిలో అశోక్, పూజ, కిరణ్ (హైదరాబాదు), శంకర్ (రంగారెడ్డి), శ్రీకాంత్ (కరీంనగర్), శ్రీకాంత్ వర్మ (సూర్యాపేట), ప్రశాంత్ (మహబూబ్‌నగర్) ఉన్నారు. సహాయ కార్యదర్శులుగా యార ప్రశాంత్ (వరంగల్), శంకర్ (నల్గొండ), రంజిత్ రెడ్డి (సిద్ధిపేట), దీపిక, మమత, ఆదిక్ (హైదరాబాదు) ఎన్నికయ్యారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: