ఖమ్మం వార్తలు

డిప్యూటీ సీఎం భట్టిని మర్యాద పూర్వకంగా కలిసిన ఖమ్మం ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి

డిప్యూటీ సీఎం భట్టిని మర్యాద పూర్వకంగా కలిసిన ఖమ్మం ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరికి డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రిగా నియామకమైన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశానని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఖమ్మం పర్యటనలో ఉన్నారని తెలుసుకొని హైదరాబాద్ నుంచి వచ్చి మర్యాద పూర్వకంగా కలిశానని క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇంచార్జి మంత్రి మీడియా ప్రతినిధులకు తెలిపారు.

త్వరలో ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులతో సంప్రదించి ఒక తేదీ ఖరారు చేసుకుని, జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.

అంతకుముందు ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు వాకిటి శ్రీహరిని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లు మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.

Related posts

జుబ్లియంట్ మూడ్ లో భట్టి, పొంగులేటి ,తుమ్మల

Ram Narayana

చేతి గుర్తా …? కారు గుర్తా …? ఓటర్లు దేవుళ్ళు ఎవరిని కరుణించారు ..

Ram Narayana

రామారావు హత్య… సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు ..

Ram Narayana