Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రక్షాళన దిశగా కేంద్ర కెబినెట్ …పలువురు మంత్రుల రాజీనామా !

ప్రక్షాళన దిశగా కేంద్ర కెబినెట్ …పలువురు మంత్రుల రాజీనామా !
-కేంద్ర కేబినెట్ నుంచి ఇప్పటికే ఆరుగురు అవుట్ .. ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ రాజీనామా

-సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్  అవుట్ 
-సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ
-ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తున్న పలువురు మంత్రులు
-ఏడుగురు సహాయ మంత్రులకు ప్రమోషన్
-43 మందికి కొత్తగా చోటు
-12 మంది ఎస్సీలు, ఏడుగురు ఎస్టీలకు అవకాశం
-27 మంది ఓబీసీలకు పదవి
-25 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం
-కేబినెట్ లో చదువుకున్న వారూ ఎక్కువే

ఈ సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ ను ప్రధాని మోదీ ప్రక్షాళన చేస్తున్నారు. పలువురు కొత్త వారికి కేంద్ర మంత్రి వర్గంలో ఆయన స్థానం కల్పించబోతున్నారు. మరికొందరు మంత్రులకు ప్రమోషన్ ఇస్తున్నారు. ఇదే సమయంలో కొందరికి ఉద్వాసన పలకబోతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.

మరోవైపు అన్నివర్గాలకు సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని ప్రధాని మోదీ ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త మంత్రి వర్గంలో ఆరుగురు వైద్యులు, ఐదుగురు ఇంజినీర్లు, 13 మంది న్యాయవాదులు ఉండబోతున్నట్టు సమాచారం. వీరితో పాటు పీహెచ్డీ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యావంతులకు మోదీ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. సహాయమంత్రులుగా ఉన్న ఏడుగురికి ప్రమోషన్ దక్కనున్నట్టు సమాచారం.

మోడీ కేబినెట్ లో భారీ మార్పులు …43 మందికి కొత్తగా చోటు

ప్రధాని నరేంద్ర మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా చేస్తున్న మంత్రివర్గ విస్తరణ ఇది. ఈసారి మంత్రివర్గంలో అన్ని వర్గాల వారికి ఎన్డీఏ సర్కారు సమ ప్రాధాన్యం ఇచ్చింది. చెప్పుకోదగిన రీతిలో మహిళలకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 43 మంది మంత్రులతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పెద్ద చదువులున్న వారు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది.

కొత్త కేబినెట్ లో వీరు…

11 మంది మహిళలకు చోటు
12 మంది దళితులకు చోటు. అందులో ఇద్దరికి ఫుల్ కేబినెట్ హోదా
27 మంది ఓబీసీలకు చోటు. 19 వెనుకబడిన కులాల నుంచి ప్రాతినిధ్యం. అందులో ఐదుగురికి కేబినెట్ హోదా.
ఏడు వేర్వేరు గిరిజన తెగల నుంచి 8 మంది ఎస్టీలకు అవకాశం
ఐదుగురు మైనారిటీలకు మంత్రి పదవి
బ్రాహ్మణులు, భూమిహార్, కాయస్థ, క్షత్రియ, లింగాయత్, పటేల్, మరాఠా, రెడ్డి వర్గాలకు చెందిన 29 మందికి మంత్రి పదవులు.
మంత్రివర్గంలో 14 మంది 50 ఏళ్ల లోపు వారే. అందులో ఆరుగురికి కేబినెట్ బెర్త్ .
మంత్రివర్గ విస్తరణ తర్వాత మోదీ టీమ్ సగటు వయసు 58 ఏళ్లు.
కేబినెట్ లో 46 మందికి వివిధ రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం
23 మంది మూడు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు ఎంపీగా గెలిచినవారే. దశాబ్ద కాలానికి పైగా అనుభవం
కొత్త కేబినెట్ లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులకు అవకాశం.
25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన నేతలకు ప్రాతినిధ్యం. దాదాపు దేశం నలుమూలలకు చెందిన వారికి అవకాశం.
ఐదుగురు మంత్రులు ఈశాన్య రాష్ట్రాల వారు.

మంత్రుల చదువు..

ఏడుగురు మంత్రులు పీహెచ్ డీ చేశారు. ముగ్గురు ఎంబీఏ, 13 మంది లాయర్లున్నారు. ఆరుగురు వైద్యులు, ఐదుగురు ఇంజనీర్లు, ఏడుగురు సివిల్ సర్వెంట్లు, 68 మంది డిగ్రీ చదివిన వారున్నట్టు సమాచారం.

Related posts

కాంగ్రెస్ ‘జనగర్జన’లో ప్రసంగించేది ఆ ఆరుగురే..!

Drukpadam

బీజేపీ జనసేనకు రోడ్ మ్యాప్ పై సిపిఐ నారాయణ అభ్యంతరం!

Drukpadam

వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: బాలకృష్ణ

Drukpadam

Leave a Comment