విద్యార్థుల మరణాలు ఆందోళనకరం …
48 గంటల్లో తెలంగాణలో ఏడుగురు గురుకుల విద్యార్థులు మృతి
ఐదు జిల్లాల్లో సంఘటనలు …ఆందోళనలో విద్యార్థులు
వివిధకారణాల చేత తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కేవలం 48 గంటల్లో 7 గురు విద్యార్థులు చనిపోవడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి…ప్రత్యేకించి గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న సంఘటనలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ..
సూర్యాపేట – నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని తనుషా మహాలక్ష్మి ఆత్మహత్య
మహాబాబుబ్ నగర్ – మల్దకల్‌లో ఇంటర్ చదవడం ఇష్టంలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన హరికృష్ణ అనే ఇంటర్ విద్యార్థి
స్టేషన్‌ఘన్‌పూర్ మహాత్మాజ్యోతి బాపూలే రెసిడెన్సియల్‌లో వాకింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చి కిందపడి.. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన మణితేజ అనే విద్యార్థి
యువకుడి వేధింపులు భరించలేక వికారాబాద్ జిల్లా పరిగి మండలం యబాజీగూడకు చెందిన కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్య
పాలమాకుల కేజీబీవీలో పదో తరగతి చదువుతున్న నవీంద్ర (16) అనే విద్యార్థిని
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో గురుకులంలో ఉండడం ఇష్టం లేక.. వసతి గృహంపై నుంచి దూకి పారిపోయేందుకు యత్నించి ప్రాణాలు కోల్పోయిన సంధ్య అనే విద్యార్థిని
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో ఆశ్రమ పాఠశాలలో నాలుగు రోజులుగా తీవ్రజ్వరంతో బాధపడుతూ భాను ప్రకాష్(13) అనే విద్యార్థి మృతి
ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యి.. ఈ నెల 11న ఇంటికి రాగా, తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లాలని చెప్పగా పోనని ఇంటివద్దే ఉండి ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్న సుర్పం శేఖర్ (17) అనే విద్యార్థి మృతి చెందారు …దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు …