గులాబీ గూటికి ఎల్.రమణ… ప్రగతిభవన్‌కు కేసీఆర్ తో భేటీ !
-వెంట వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-ఇప్పటికే మద్దతుదారులతో చర్చలు
-టీడీపీకి రాజీనామా సమర్పించనున్న రమణ?
టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రగతిభవన్‌లో గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి పార్టీలో చేరేందుకు తన సమ్మతిని తెలిపారు .ఆయన వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. ఇప్పటికే ఎల్.రమణ్ తన కార్యకర్తలు, అభిమానులతో పార్టీ మారే విషయంపై చర్చించారు.
కేసీఆర్‌తో భేటీ అనంతరం మీడియా సమావేశం మాట్లాడుతూ తెలంగాణ లో మారుతున్నా రాజకీయసమీకరణలలో తాను టీఆర్ యస్ లో చేరబోతున్నట్లు వెల్లడించారు. . టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు గతంలోనే పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అప్పడు అయన దాన్ని సున్నితంగా ఖండించారు పార్టీ మారనున్నట్లు గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈటల పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరువాత బలమైన బీసీ నేతను పార్టీలోకి తెచ్చుకోవాలని తపనతో ఉన్న టీఆర్ యస్ ఎల్ రమణకు గాలం వేసింది. ఆ గాలానికి ఆయన చిక్కారు. ఎల్.రమణతో ఇప్పటికే టీఆర్ఎస్ చర్చలు జరిపింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.రమణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పరాజయాన్ని చవిచూశారు.
టీఆర్ యస్ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మంత్రి పదవిని ఆఫర్ చేశారా ?అనేది ఇంకా తెలియసి ఉంది.