మంత్రి పదవి ఇస్తారా ..?ఇవ్వరా ?? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా అనేది మీ ఇష్టం
పదవి కోసం ఎవరి దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకొను .బ్రతిమిలాడాను
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై రుసరుస లాడుతున్నారు …తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు …తరుచు ప్రభుత్వ విధానాలపైనా సీఎం రేవంత్ రెడ్డి పైన మాటల దాడి చేస్తున్నారు ..ఇది పార్టీకి ,ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది …ఇప్పటికే తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు …దీంతో ఆయనకు మంత్రి పదవి ఇస్తే విమర్శలు వస్తాయని అది ప్రతిపక్షాల నుంచే కాకుండా సొంతపార్టీ నుంచి కూడా తప్పవనే అభిప్రాయాలూ ఇటు రాష్ట్ర నాయకత్వం , అటు అధిష్టానం వ్యక్తం చేస్తున్నాయి…ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇస్తారు కాను ఇద్దరికీ ఎలా ఇస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…ఒక కుటుంబంలో ఇద్దరికీ టికెట్స్ ఇవ్వడమే సరైంది కాదని అభిప్రాయాలూ ఉన్న అన్ని పార్టీల్లో ఇది ఉన్నందున పెద్దగా ఇబ్బందులు లేవు ..కానీ మంత్రి పదవులు ఇస్తే అది తప్పుడు సంకేతాలకు దారి తీస్తుంది ..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉండగానే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు …ఫలితంగా ఉపఎన్నిక వచ్చింది …బీజేపీ తరుపున పోటీచేసి బీఆర్ యస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు …తిరిగి శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు …కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా అధిష్టానం ఆయనకు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది …కానీ మంత్రి పదవి రాలేదు …తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో భవనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపీగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి మాటతప్పారని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు ..దీనిపై అటు అధిష్టానంగాని ఇటు రాష్ట్ర కాంగ్రెస్ కానీ మాట్లాడటంలేదు … “నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.. ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం” “భువనగిరి ఎంపీ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు”అంటున్నారు రాజగోపాల్…తనకంటే జూనియర్లకు, ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్లకు మంత్రి పదవి ఇచ్చారని తనకు మాత్రం ఇవ్వకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు ..మంత్రి పదవికోసం
తాను ఎవరింటికి పోయి కళ్లు పట్టుకొని బ్రతిమిలాడను -అని నిష్కర్షగా అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…