ఐజేయు జాతీయ కౌన్సిల్ కు ఖమ్మం జిల్లా నుంచి ,రామ్ నారాయణ, వెంకటరావు
జెడ్పిలో కన్నుల పండువగా నామినేషన్లు, ఎన్నికల పర్వం





ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) జాతీయ కౌన్సిల్ కు ఖమ్మం జిల్లా నుంచి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె .రాంనారాయణ , ఆంధ్రజ్యోతి ఉమ్మడి జిల్లా బ్యూరో ఇంచార్జి నలజాల వెంకట్రావు లను ఎంపిక చేసింది …శుక్రవారం వారి నామినేషన్ పత్రాలపై నిబంధనల ప్రకారం పూర్తీ చేసి స్టేట్ రిటర్నింగ్ అధికారి అమరవాది రవీంద్ర శేషుకు పంపించారు .. శుక్రవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో వారి ఎంపికను జిల్లా కమిటీ ఏకగ్రీవంగా చేసింది . కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామ్ నారాయణ , యూనియన్ సీనియర్ నాయకులు, ఆంధ్రజ్యోతి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ నలజాల వెంకట్రావు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో శుక్రవారం జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో జిల్లా నుండి రెండు నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఐజేయు నూతన సభ్యులను జెడ్పీ మీటింగ్ హాల్లో జిల్లా అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో సంఘ నాయకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్య లో పాల్గొని అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామ్ నారాయణ గారు మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా జాతీయ కౌన్సిల్ కు సిఫార్స్ చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం, సంఘాన్ని బలోపేతం చేయడం కోసం మరింతగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఐజేయు నూతన సభ్యులు నలజాల వెంకటరావు మాట్లాడుతూ జాతీయ కౌన్సిల్లో తనకు అవకాశం కలిగించడం పట్ల జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘ నిర్మాణం కోసం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జాతీయస్థాయిలో తన వాణి వినిపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మైస పాపారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్, రాష్ట్ర నాయకులు వనం వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి జనతా శివ, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు మామిడాల భూపాల్, పసునూరి మహేందర్, జిల్లా ఉపాధ్యక్షులు, ఖమ్మం జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, ఖమ్మం సిటీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాసరావు, నంచర్ల జనార్ధన చారి , కోశాధికారి ఏలూరీ వేణుగోపాలరావు, వేదగిరి శ్రీనివాసరావు, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నామ పురుషోత్తం, శీలం శ్రీనివాస్, కోశాధికారి కళ్యాణ్, జిల్లా ఉపాధ్యక్షులు మోటపోతుల బాబురావు, డిడి రమేష్, రాజారావు, జిల్లా జాయింట్ సెక్రటరీ పసుపులేటి సత్యనారాయణ, జిల్లా నాయకులు ఆలస్యం అప్పారావు, చెరుకూరి గోపాలరావు, మేడి రమేష్, డెస్క్ జర్నలిస్టు నాయకులు పోటు శ్రీనివాస్, గోసుల నాగేశ్వరరావు, సాక్షి రామారావు, ఉపేందర్, సుమన్ టీవీ ఉమ్మడి జిల్లా బ్యూరో రామకృష్ణ, ఖమ్మం టీవీ శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి నాగేశ్వరరావు, కుమార్, ఫోటో జర్నలిస్టు రవి తదితరులు పాల్గొన్నారు. ఐజేయు నూతన సభ్యులకు ఎంపిక చేసిన వారిని శాలువాలతో సత్కరించి బొకేలతో అభినందనలు తెలిపారు.







