పార్లమంట్ న్యూస్ ...

డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. షెడ్యూల్ విడుదల

  • డిసెంబర్ 19 వరకు కొనసాగనున్న సమావేశాలు
  • కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం
  • అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మొత్తం 19 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి.

ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు. శీతాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు.

“పార్లమెంటరీ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి, డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించారు” అని కిరణ్ రిజిజు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో సమావేశాల నిర్వహణకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుంది.

Related posts

డబ్బులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు… మహువా మోయిత్రాపై ఆరోపణల మీద తృణమూల్ మౌనం

Ram Narayana

పార్లమెంటులో సొమ్మసిల్లి పడిపోయిన వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్…

Ram Narayana

క్రిమినల్ చట్టాలను సవరించడానికి కేంద్రం చర్యలు …పార్లమెంట్ లో బిల్లు..!

Ram Narayana