Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విమానంలో వెకిలి చేష్టలు-విజయవాడ ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి అరెస్ట్

మస్కట్ నుంచి గన్నవరం మీదుగా హైదరాబాద్ వెళ్తున్న విమానంలో ఓ మహిళను వేధించిన ప్రయాణికుడిని విజయవాడ ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు లక్ష్మణ్ అనే ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది గన్నవరం పోలీసులకు అప్పగించారు.

మస్కట్ నుంచి బయలుదేరిన విమానంలో తనతో కలిసి పక్క సీట్లో ప్రయాణిస్తున్న ఓ మహిళను లక్ష్మణ్ అనే ప్రయాణికుడు గమనించాడు. విమానం టేకాఫ్ కాగానే ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. తనను శారీరకంగా కూడా హింసించాడు. దీంతో విమానం గన్నవరం చేరుకునే వరకూ వేచి చూసిన ఆమె… ల్యాండింగ్ కాగానే భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఫిర్యాదు చేసిన అంశాల ఆధారంగా ప్రాధమికంగా లక్ష్మణ్ ను విచారించి గన్నవరం పోలీసులకు అప్పగించారు.

మస్కట్-హైదరాబాద్ విమానంలో తోటి ప్రయాణికుడి నుంచి వేధింపులకు గురైన మహిళను హైదరాబాద్ కు చెందిన అరుణగా గుర్తించారు. ఆమె విమానంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గన్నవరం పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పీఎస్ లో నిందితుడు లక్ష్మణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు సిబ్బందితో పాటు సదరు ఎయిర్ లైన్స్ సిబ్బంది నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

 

Related posts

వచ్చే నెల 15 నుంచి తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ…

Drukpadam

మునుగోడు టీఆర్ యస్ దే అంటున్న సర్వేసంస్థలు…

Drukpadam

ఒక్క చేప ఖరీదు రూ.2.2 కోట్లు… ఎక్కడో చూడండి!

Drukpadam

Leave a Comment