తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!


తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి, బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేశారు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా అంతకు ముందు నెక్లెస్ రోడ్డులో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు.

ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రేవంత్ రెడ్డి సర్కార్, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమా న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాలన బలహీన వర్గాలకు సువర్ణ అధ్యాయమని, ఆమె పరిపాలన ఒక మోడల్ అని కొనియాడారు.

ఇందిరా గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో ‘ప్రజాపాలన’ అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలనే ఉద్దేశంతోనే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ జయంతి రోజు అయిన నేడు ప్రారంభిం

Related posts

వ్యవసాయ కూలీలపై పిడుగు .. ముగ్గురు దుర్మరణం!

Ram Narayana

రిజర్వేషన్‌తో జాక్‌పాట్.. తెలంగాణలో ఒకే కుటుంబానికి సర్పంచ్, రెండు వార్డు పదవులు!

Ram Narayana

ఆర్టీసీ బస్‌పాస్‌ చార్జీల పెంపుపై ఆందోళన : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌!

Ram Narayana