జాతీయ వార్తలు

ముగిసిన హిడ్మా అంత్యక్రియలు

ముగిసిన హిడ్మా అంత్యక్రియలు

మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని సహచరి రాజే అంత్యక్రియలు గురువారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలోని ఆయన సొంత గ్రామం పూవర్తి లో జరిగాయి ..పోలిసుల నిర్బంధం ఉన్న వందలాది గిరిజనలు హిడ్మా అంత్యక్రియలకు హాజరైయ్యారు ..

చుట్టు పక్కల గ్రామాల నుండి తరలి వచ్చిన వందలాది ఆదివాసీల మధ్య అంత్యక్రియలు ఘనంగా ముగిసాయి. అంత్యక్రియలకు ఎక్కువ మంది రాకుండా భద్రతా బలగాలు అనేక ఆంక్షలు విధించినప్పటికీ వందలాది తరలివచ్చారు.

ఆంక్షల కారణంగా ఎక్కువమంది రాకపోవచ్చు అని పోలీసు ఉన్నతాధికారుల భావించినప్పటికీ వారి ఆంక్షలను ధిక్కరిస్తూ చుట్టూ పక్కల గూడెల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడం అధికారులను ఆశ్చర్య పోయేలా చేసింది.

హిడ్మా మృత దేహం…

ఏపీలో ఆయన పోస్టుమార్టం పూర్తీ అయినా తర్వాత ఆయన సోదరుడు హిద్మ ,ఆయన భార్య మృతదేహాలను తీసుకోని వచ్చారు .. సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చేరుకున్న మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతదేహం చూసేందుకు వందలాది మంది గిరిజనులు వచ్చారు ..
పువర్తిలో తీవ్ర విషాద ఛాయలు.. గ్రామంలోని 50 ఇళ్లకు గాను సగానికి పైగా ఇళ్లకు తాళాలు..
హిడ్మా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు…బోరున విలపిస్తున్న నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి మాంజు, ఇతర బంధువులు…

కేవలం 50 ఇళ్లున్న పువర్తి గ్రామం నుంచి ఏకంగా 90 మంది యువకులను మావోయిస్టులుగా మార్చిన హిడ్మా…ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్స దేవా, హిడ్మా తర్వాత కీలక నేత…మావోయిస్టుల పూర్తి నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతంలో దశాబ్దాల తర్వాత ఏడాది కిందట సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు….

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పువర్తి పోలింగ్ బూత్ పరిధిలోని 547 ఓట్లకు గాను కేవలం 31 ఓట్లు పోలవగా, పువర్తి గ్రామం నుంచి ఒక్క ఓటు కూడా నమోదు కాని వైనం…హిడ్మా తలపై ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ప్రకటించిన రివార్డు మొత్తం 1కోటి 80 లక్షలు…

Related posts

ఢిల్లీలో మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు!

Ram Narayana

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.20 కోట్లు.. బీజేపీపై టీఎంసీ సంచలన ఆరోపణలు!

Ram Narayana

 ప్రధాని మోదీతో దాదాపు గంటపాటు చంద్రబాబు భేటీ

Ram Narayana