Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పీఆర్ సి పై తెలంగాణ ఉద్యోగసంఘాల భగ్గు ,భగ్గు

పీఆర్ సి పై తెలంగాణ ఉద్యోగసంఘాల భగ్గు ,భగ్గు
ఫిట్ మెంట్ కేవలం 7 .5 శాతం పెంపుపై ఆగ్రహం
-ఉద్యోగుల ఫ్రెండ్లి ప్రభుత్వం అంటే ఇదేనా అని నీలదీత
మా డిమాండ్లు ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఆశతో ఎదురుసూస్తున్న వేతన సవరణ కమిషన్ సిఫార్సులను ఎట్టకేలకు విడుదల చేశారు. కానీ సిఫార్సులను చూసి ఉద్యోగుల షాక్ తిన్నారు. ఈ సిఫార్సులు తమకు ఆమోద యోగ్యంగా లేవని భగ్గుమన్నారు…… ఉద్యోగసంఘాల నాయకుల పై ఉద్యోగులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు….. ఇప్పటి వరకు ఆగమన్నారు మనదే ప్రభుత్వం అన్నారు . మనదే అంటే మన నోర్లు కొట్టడమా అంటూ ,ఫిట్ మెంట్ కేవలం 7 .5 శాతం పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు …….-ఉద్యోగుల ఫ్రెండ్లి ప్రభుత్వం అంటే ఇదేనా అని నిలదీస్తున్నారు. ……మా డిమాండ్లు ఏ మాత్రం పట్టించుకోలేదని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. …. పదవి విరమణ వయసు 60 సంవత్సరాలకు పెంచుతున్నట్లు చెప్పటం కొంత ఆశాజనకంగా ఉన్నా,హెచ్ ఆర్ ఎ ని 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించటం విశేషం .అంటే ప్రభుత్వం రివర్స్ గేర్ లో నడుస్తున్నదా అంటున్నారు. ఉద్యోగ సంఘాలు 63 శాతం ఫిట్ మెంట్ అడుగుతుంటే పీఆర్ సి కమిషన్ మాత్రం కేవలం 7 .5 శాతం మాత్రమే సిఫార్స్ చేయటం విడ్డురంగా ఉండనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇది ఎప్పుడైనా జరిగిందా ? అంటున్నారు ….. ఇప్పటి వరకు మన రాష్ట్రము మన ఉద్యోగాలు మన వేతన సవరణ అను కున్న ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. మంగళవారం పీఆర్ సి ని వెబ్సైట్ లో ఉంచటంతో ఆ ప్రతులను డౌన్ లౌడ్ చేసుకున్న ఉద్యోగ సంఘాలు వాటిని తగలబెట్టారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ ఇంత దారుమైన పీఆర్ సి ని తాము పొందలేదని ఉద్యోగులు మండి పడుతున్నారు. రాష్ట్ర సాధన కోసం తాము చేసిన త్యాగాలను సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించాడని వాపోతున్నారు.మన రాష్ట్రము లో మనం కడుపు నిండా పెట్టుకొందామన్న కేసీఆర్ కడుపునిండా అంటే అర్థం ఇదేనా ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరగా 43 శతం ఫిట్మెంట్ ఇస్తే ఏ లెక్కన కేసీఆర్ ప్రభుత్వం ఫిట్మెంట్ ను లెక్కించింది ఉద్యోగులు అడుగుతున్నారు. అసలు పీఆర్ సి ఇంతకాలం జాప్యం చేయటమే కాకుండా దాన్ని ఒక తంతుగా చేసి తాము చెప్పింది రాయమన్నట్లుగా ఉంది తప్ప వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా కూడా లేదని అంటున్నారు.

పీఆర్ సి నివేదిక బయట పెట్టిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతలు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను కలిశారు. పీఆర్ సి పై తమ అభ్యంతరాలను ఆయనకు తెలియజేశారు. సి యస్ వారితో మాట్లాడుతూ , ఫిట్ మెంట్ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అయితే ఇదేమి న్యాయం ఫిట్ ఇంత దారుణంగా ఉంది . దీనిపై ఉద్యోగులంతా చాల సీరియస్ గా ఉన్నారు . ఇప్పటి వరకు ఇదిగో అదిగో అంటూ వచ్చారు ఇచ్చే ఫిట్ మెంట్ ఇదా ? అంటూ సి యస్ ను సైతం నిలదీశారు. దీనిపై తాను ముఖ్యమంత్రి తో మాట్లాడతానని ఫిట్ మెంట్ విషయం సీఎం నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగ సంఘ నేతలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది . ఉద్యోగ సంఘ నాయకులూ మాత్రం తాము గతంలో ఇచ్చిన 43 శాతం ఫిట్మెంట్ కు తక్కువ ఇస్తే ఒప్పుకోమని చెప్పారు . అనంతరం మమతా , రాజేందర్ లు మీడియాతో మాట్లాడుతూ తాము ఫిట్మెంట్ విషయంలో ముఖ్యమంత్రిని ఒప్పిస్తామనే విశ్వసాం వ్యక్తం చేశారు. తమకు రాజకీయాలతో సంభందం లేదన్నారు . అనేక జిల్లా కేంద్రాలలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పీఆర్సీ పై నిరసన కార్యక్రమాలు జరిగాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎప్పుడు 35 శాతం తగ్గకుండా ఇచ్చారని అన్నారు. సీఎం ఆయన జేబులో డబ్బులు ఇవ్వటం లేదని పీఆర్సీ ఇచ్చేందుకు కొన్ని పరిణామాలను లెక్కలోకి తీసుకొంటారని అలంటిది ఏమి లేకుండా తమ దాయ దాక్షణ్యాల మీద ఆధారపడి ఇచ్చేది కాదని అన్నారు . ఫిట్ మెంట్ పేరుతొ కేసీఆర్ ఉద్యోగులను మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ మండి పడ్డారు. ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ఫిట్మెంట్ వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి , ఉద్యోగాల సంఘాల మాజీ నేత శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ ఫిట్ మెంట్ విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి అన్ని చూసుకుంటారని అన్నారు .

Related posts

ఢిల్లీలో గాలి.. వర్ష బీభత్సం దృశ్యాలు ….

Drukpadam

ఎయిరిండియాపై అమెరికా కోర్టులో దావా వేసిన కెయిర్న్ ఎనర్జీ…

Drukpadam

మైసూరు-చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆరంభం.. 

Drukpadam

Leave a Comment