కేటీఆర్ కు ఖమ్మంలో గ్రాండ్ వెల్కమ్ …
హామీల అమల్లో రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యం
ప్రాజెక్టులు కట్టలేని దద్దమ్మ ప్రభుత్వం
మాటలు తప్ప చేతలు లేని రేవంత్ రెడ్డి
రాష్ట్ర నీటి వాటాపై చెపుదామంటే శాసనసభలో సమయం ఇవ్వలేదని ఆరోపణ

మాజీ మంత్రి ,బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు బుధవారం ఖమ్మం వచ్చిన సందర్భంగా ఆ పార్టీ నాయకులూ ,కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ పలికారు .హైద్రాబాద్ నుంచి ఖమ్మం రోడ్ మార్గంలో వచ్చిన కేటీఆర్ ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు ఖమ్మం కూరగాయల మార్కెట్ సమీపంలోని ఆంజనేయస్వామి టెంపుల్ వద్ద స్వాగతం పలికారు …అక్కడ నుంచి కేటీఆర్ ,అజయ్ , నామా ,ఇతర నాయకులూ ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ జిల్లా బీఆర్ యస్ కార్యాలయం వరకు వెళ్లారు ..ఈ సందర్భంగా బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది ..పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తూ వాహనాలను పంపించారు …ఇటివల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను సన్మానించేందుకు ఆయన స్వయంగా ఖమ్మం రావడం తో అభిమానులు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ..టపాసులు పేలుస్తూ , బీఆర్ యస్ పాటలతో ర్యాలీ సాగింది ..కొందరు కార్యకర్తలు నృత్యం చేయగా, మరికొందరు నినాదాలు చేస్తూ ర్యాలీని రక్తి కటించారు ..
కేసీఆర్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
అనంతరం బీఆర్ యస్ పార్టీ కార్యాయలంలో సర్పంచులను సన్మానించి ప్రసంగిస్తూ గ్రామాల అభివృద్ధికి సర్పంచులు పనిచేయాలని అన్నారు ..గ్రామాలూ కాస్తే కూస్తో అభివృద్ధి చెందాయంటే అది కేసీఆర్ హయాంలోనేనని అన్నారు .. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు ..కోర్ట్ మొట్టి కాయలు వేస్తె తప్ప గ్రామా పంచాయతీల ఎన్నికలు పెట్టెలదని ఇంట చేతగాని ,దద్దమ్మ ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చెందలేదని ప్రభుత్వ విధానాలను కేటీఆర్ దుయ్యబట్టారు .. సీఎం రేవంత్ రెడ్డికి తిట్లపై ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదని ధ్వజమెత్తారు …నీటి వాటా గురించి అడిగితె లేని పోనీ పొంతనలేని లెక్కలు చెపుతున్నారని అన్నారు …కృష్ణా ,గోదావరి నదులపై ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయనేది తెలియని అజ్ఞానమైన ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయడం విడ్డురంగా ఉందని దుయ్యబట్టారు ..
అంతకు ముందు మార్గమధ్యలో నాయకునిగూడెం టోల్ ప్లాజా వద్ద జరిగిన ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు …ఆయన్ను కలిసేందుకు , షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు యువకులు పోటీపడ్డారు …కేటీఆర్ చిరునవ్వుతోనే అందరికి షేక్ హ్యాండ్ ఇస్తూ అభివాదాలు చెప్పారు ..కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు ,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ , మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు , మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య , కందాల ఉపేందర్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు ..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం,సింగరేణి పల్లి టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు బుధవారం ఉదయం ఖమ్మం వెడుతూ మార్గమధ్యంలో కొద్ది సేపు ఆగి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిలతో కలిసి టీ తాగారు.ఈ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడి కేటీఆర్ గారితో ఫోటోలు దిగారు.