ఖమ్మం వార్తలు

సిపిఐ 100 సంవత్సరాల పండుగ… వేదిక కానున్న ప్రభుత్వ కళాశాల గ్రౌండ్

సిపిఐ శత వసంతాల వేడుక వేడుకకు సిద్ధమవుతున్న ఖమ్మం

సభా స్థలిని పరిశీలించిన సిపిఐ నాయకులు

భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల ముగింపు సందర్బంగా ఈనెల 18న బహిరంగ సభ జరగనున్న

ఎస్ఆర్అండ్్బజిఎస్ఆర్ కళాశాల మైదానాన్ని శుక్రవారం సిపిఐ నేతలు పరిశీలించారు. సభా వేదిక, కళాకారుల వేదిక నిర్మాణ ప్రాంతాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. కళాశాల మైదానం మొత్తం పరిశీలించి వాలంటీర్లకు తగు బాధ్యతలు -అప్పగించారు. సభా స్థలికి హాజరయ్యే నాయకులు, కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా రాకపోకలకు అంతరాయం కలుగకుండా భారీకేడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు తెలిపారు. సభాస్థలిని పరిశీలించిన వారిలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, కార్యవర్గ సభ్యులు యర్రాబాబు, కొండపర్తి గోవిందరావు, బిజి క్లెమెంట్, మేకల శ్రీనివాసరావు, పోటు పూర్ణ, చింతల రమేష్, నంబూరి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొత్తగూడెంలో వనమా గెలుపు కోసం ఎంపీ వద్దిరాజు బుల్లెట్ పై హల్చల్

Ram Narayana

కొత్త న్యాయ చట్టాల్లో సవరణ చేయాలి mp వద్దిరాజుకు ఖమ్మం బార్ సభ్యుల వినతి!

Ram Narayana

భద్రాచలం సీఐ రమేష్ అరెస్ట్

Ram Narayana