తెలంగాణ వార్తలు

ఎన్టీవీ ప్రతినిధులు దొంతు రమేష్, సుధీర్ లకు బెయిల్ మంజూరు

వ్యక్తులను టార్గెట్ చేస్తూ వారి క్యారెక్టర్స్ హననం చేసేవిధంగా ఎన్టీవీ లో వార్త కథనాలు ప్రసారం చేశారని ఆరోపిస్తూ అరెస్ట్ చేసిన ఇన్ ఫుట్ ఎడిటర్ దొంతు రమేష్ , ప్రతినిధి సుధీర్ లకు నాంపల్లి కోర్ట్ రాత్రి పొద్దుపోయిన తర్వాత బెయిల్ మంజూరు చేసింది …

పోలీసులు బాధితులని చెప్తున్న వారెవరూ ముందుకు వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు…
బాధితులని చెప్తున్నవారి పేర్లు గానీ, స్టేట్మెంట్ గానీ లేదుకదా అని అడిగితే.. వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడలేదని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది.దీంతో
దొంతు రమేష్, సుధీర్ పాస్పోర్టులు సరెండర్ చేయాలని కోర్ట్ వారు ఆదేశించి బెయిల్ మంజూరు చేశారు . రూ. 20 వేల నగదు, రెండు పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది .

పోలీసుల చర్యలు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయన్న కోర్టు
జర్నలిస్టులు దొంతు రమేష్‌ (ఇన్‌పుట్ ఎడిటర్), సుధీర్‌ (రిపోర్టర్)లకు మేజిస్ట్రేట్ కోర్టులో ఊరట లభించింది. వీరి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. ఇటీవల ప్రసారమైన ఓ వివాదాస్పద కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు పలువురు జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.

దొంతు రమేష్‌ను హైదరాబాద్‌ విమానాశ్రయంలో బ్యాంకాక్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకోగా, సుధీర్‌ను ఆయన నివాసం వద్ద అరెస్టు చేశారు. జర్నలిస్టుల అరెస్టులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.

నిన్న వీరిద్దరినీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచి పోలీసులు రిమాండ్ కోరారు. అయితే ప్రాథమిక ఆధారాలు సరిపోవడం లేదని, అరెస్టు సమయంలో నోటీసులు ఇవ్వకపోవడం వంటి విధి విధానాల్లో లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తరహా చర్యలు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంటాయని పేర్కొంటూ రిమాండ్‌ను తిరస్కరించి, బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది.

ఈ ఘటనపై బీఆర్ఎస్, వైసీపీ నేతలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా స్పందించాయి. మరోవైపు పోలీసులు మాత్రం తమ చర్యలు చట్టబద్ధంగానే చేశామని స్పష్టం చేశారు.

Related posts

అధిక వడ్డీ ఆశతో కొంప కొల్లేరు …భాదితుల లబోదిబో …

Ram Narayana

రెండో విడత పద్మ పురస్కారాలు: శోభనకు పద్మభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ ప్రదానం..

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు లేఖ…

Ram Narayana