ఆంధ్రప్రదేశ్

ఇదీ మా కుటుంబం… గ్రూప్ ఫొటో పంచుకున్న నారా లోకేశ్

  • నారావారిపల్లెలో కుటుంబంతో కలిసి మంత్రి లోకేశ్ సంక్రాంతి వేడుకలు
  • కుటుంబమే మా బలమంటూ ఫొటో పంచుకున్న లోకేశ్
  • భోగి నాడు 81వ ప్రజా దర్బార్ నిర్వహణ
  • ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి హామీ
  • గ్రామంలోని సాంప్రదాయ క్రీడలు, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న నారా కుటుంబం

“ఇది మా కుటుంబం – సాంప్రదాయాలే మా మూలాలు, కుటుంబమే మా బలం. ఈ పంట పండటానికి సహకరించిన రైతుకు, నేలకు మరియు ఆ సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ… మన ఇళ్లు ఎల్లప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు” అని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తమ కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి సొంత గ్రామమైన నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. పండుగ సంబరాల్లో పాల్గొంటూనే, మంత్రి లోకేశ్ తన ప్రజా సేవను కొనసాగించారు. భోగి పర్వదినం నాడు నారావారిపల్లెలోని తన నివాసంలో 81వ ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ఈ ప్రజా దర్బార్‌లో భూ వివాదాలు, ఉద్యోగాల పునరుద్ధరణ, ఎస్టీలకు ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి పలు సమస్యలపై ప్రజలు ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న లోకేశ్, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అంతకుముందు, నారా కుటుంబ సభ్యులు గ్రామంలో జరిగిన ముగ్గుల పోటీలు, చిన్నారుల క్రీడలను వీక్షించారు. ఈ వేడుకల్లో లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ఉత్సాహంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండుగ వేళ కుటుంబ సంప్రదాయాలకు, ప్రజా సేవకు సమ ప్రాధాన్యం ఇస్తూ లోకేశ్ తన పర్యటనను కొనసాగిస్తున్నారు.

సొంతూరిలో సీఎం చంద్రబాబు కుటుంబం సంక్రాంతి వేడుకలు… ఫొటో రౌండప్ ఇదిగో!

Chandrababu Naidu Celebrates Sankranti in Native Village
  • నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాలు
  • కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ, కుల దేవతలకు ప్రత్యేక పూజలు
  • తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులర్పించిన ముఖ్యమంత్రి
  • చంద్రబాబు నివాసంలో టీటీడీ పండితుల వేదాశీర్వచనాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత గ్రామమైన తిరుపతి జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఏటా సొంత గ్రామంలోనే పండుగ జరుపుకునే ఆనవాయతీని కొనసాగిస్తూ, గురువారం ఉదయం వేడుకల్లో పాల్గొన్నారు.

పండుగ సందర్భంగా, ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి మొదట గ్రామదేవత దొడ్డి గంగమ్మ ఆలయాన్ని, ఆ తర్వాత తమ కులదేవత నాగాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నివాసానికి విచ్చేసిన టీటీడీ వేద పండితులు చంద్రబాబు దంపతులకు, కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనాలు అందించారు.

అనంతరం, చంద్రబాబు తన తల్లిదండ్రులైన దివంగత నారా అమ్మణమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల వద్దకు వెళ్లి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో చంద్రబాబుతో పాటు ఆయన అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్, నటుడు నారా రోహిత్ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పండుగ వేడుకలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి అమరావతికి తిరిగి రానున్నారు.

Related posts

అంబటి రాంబాబుపై కేసు

Ram Narayana

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు

Drukpadam

తీన్మార్ మల్లన్నపై 10కోట్లకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప‌రువు న‌ష్టం దావా!

Drukpadam