తెలంగాణ వార్తలు

మున్సిపల్ ఎన్నికలకు ముందు… తెలంగాణలో 47 మంది కమిషనర్ల బదిలీ!

  • ఎస్ఈసీ మార్గదర్శకాల మేరకు కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు
  • సొంత జిల్లాల్లో పని చేస్తున్నవారు, ఒకేచోట సుదీర్ఘకాలం పని చేస్తున్న వారు బదిలీ
  • బదిలీ అయిన అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం

2026 మున్సిపల్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఈ బదిలీలు చేపట్టింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ మార్గదర్శకాల మేరకు కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారు, ఒకేచోట సుదీర్ఘ కాలం పనిచేస్తున్న అధికారులను పరిపాలనాపరమైన కారణాలతో పాటు పదోన్నతులపై బదిలీ చేసింది.

సి.వి.ఎన్. రాజు ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3) నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. జి.రాజు క్యాతనపల్లి నుంచి ఆదిలాబాద్ మున్సిపాల్ కమిషనర్‌గా, ముసాబ్ అహ్మద్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా, బి.శ్రీనివాస్ ఆలేరు నుంచి హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. బి.శరత్ చంద్ర ప్రమోషన్‌పై నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వెళ్లనున్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • బ్రేకింగ్ న్యూస్..మాస్ స్టార్ మీడియా న్యూస్.. తెలంగాణ రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముందు కొనసాగుతున్న బదిలీల పర్వం
    దాదాపు 47 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
    రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో భారీగా గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
    ★రామగుండం గ్రేడ్ 3మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు
    ★రాయికల్ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా కీర్తి నాగరాజు
    ★హాలియా గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా శ్రీనివాస్ రెడ్డి
    ★అమరచింత గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా నురుల్ నజీబ్
    ★వేములవాడ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా సంపత్ కుమార్
    ★ములుగు గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా రమేష్
    ★తిరుమలగిరి గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా రామ చంద్ర రావు
    ★ఆదిలాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా జీ రాజు
    ★ఎదులపురం గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా మునవార్
    ★బెల్లంపల్లి గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా సంపత్
    ★భూత్పూర్ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా చంద్ర శేఖర్ రావు
    ★నడికొండ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా మురళి
    ★అచ్చంపేట గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా సీహెచ్ వేణు
    ★కల్లూరు గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా రామదుర్గ రెడ్డి
    ★హుజూర్ నగర్ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా బీ శ్రీనివాస్
    ★చొప్పదండి గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా టీ మనోహర్
    ★హుజురాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా ముసబ్ అహ్మద్
    ★మంచిర్యాల గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా జి అన్వేష్
    ★ఆలేరు గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా శ్రీనివాస్ రెడ్డి
    ★మొయినాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా జకీర్ అహ్మద్

Related posts

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం డీఏ 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ!

Ram Narayana

 సిట్ విచారణకు ముందు కేసీఆర్ భావోద్వేగం!

Ram Narayana

తెలంగాణ పాట వింటూ కంటతడి పెట్టుకున్న అందెశ్రీ..

Ram Narayana