తెలంగాణ రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. శనివారం ఆయన భూ భారతి చట్టం- అవగాహన సదస్సులో పాల్గొనేందుకు నాగర్ కర్నూల్ జిల్లాకు ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ తో కలిసి హెలికాప్టర్లో వెళ్లారు. అక్కడ కలెక్టరేట్ వద్ద హెలికాప్టర్ ల్యాండింగ్ చేసేందుకు బుల్లెట్ ఫైర్ చేశారు. కింద ఉన్న గడ్డి వాముకు ఆట్టుకొని పెద్దగా మంటలు చెల రేగాయి. వెంటనే అప్రమత్తమైన పైరు సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు
Save or share this story as a newspaper-style Epaper Clip: