జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ద చర్యలు…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సన్న వడ్లు పండించిన 39,475 రైతుల ఖాతాలో 113 కోట్ల 57 లక్షలు జమ..
26 కోట్ల 31 లక్షల సబ్సిడితో 9 లక్షల 30 వేల గ్యాస్ సిలిండర్ లు సరఫరా..
200 కోట్ల 53 లక్షల తో 2,46,855 గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా..
162 కోట్ల 54 లక్షలతో మున్నేరు పాలేరు లింక్ కేనాల్ పనులు..
జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ద చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్ పాల్గొని, పోలీసు గౌరవం వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సందేశం ఇచ్చారు.
సన్న వడ్లు పండించిన 39 వేల 475 మంది రైతుల ఖాతాలలో 113 కోట్ల 57 లక్షల బోనస్ జమ చేశామని, 19 కోట్ల రూపాయల సబ్సిడీ మంజూరు చేసి ప్రస్తుత సంవత్సరం నూతనంగా మరో 8 వేల 636 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట విస్తరించినట్లు కలెక్టర్ తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలేరు లింక్ కాలువ ద్వారా పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న ఎన్.ఎస్.పి. ఎడమ కాలువ, వైరా, లంకాసాగర్ ప్రాజెక్ట్, చిన్న నీటి వనరులలో సాగునీరు అందించే ప్యాకేజీ 15 పనులు పూర్తి కాగా ప్యాకేజీ 14, 16 పనులు పురోగతిలో ఉన్నాయని, సత్తుపల్లికి సాగునీరు అందించే సత్తుపల్లి ట్రంక్ పనులు (ప్యాకేజీ 9 & 10), కాలువ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. రఘునాథపాలెం మండలంలో 66 కోట్ల 33 లక్షలతో నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభించామని, చింతకాని మండలంలో 2,500 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందించేందుకు కొదుమూరు వందనం సెకండ్ ఫేజ్ లిఫ్ట్ పనులు 35 కోట్ల 75 లక్షలతో చేపట్టినట్లు తెలిపారు. వృథాగా పోతున్న 50 నుంచి 60 టీఎంసీల మున్నేరు జలాలను వినియోగించుకుంటూ లక్షా 38 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, ప్రతి సంవత్సరం 120 కోట్ల విద్యుత్ భారం తగ్గించుకునేందుకు 4500 క్యూసెక్కుల సామర్థ్యంతో కూడిన మున్నేరు పాలేరు లింక్ కేనాల్ ను 162 కోట్ల 54 లక్షలతో చేపట్టామని అన్నారు. జిల్లాలో 38 ఆరోగ్య ఉప కేంద్రాలు, సత్తుపల్లి లోని 100 పడకల ఆసుపత్రి, కల్లూరు లోని 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలో ఆ భవనాలను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ అన్నారు. మధిరలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ఇటీవలే డిప్యూటి సీఎం చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని, వైరా, కూసుమంచి లలో 100 పడకల ఆసుపత్రులను నూతనంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు.ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఎవ్రీ చైల్డ్స్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని, ఫోనెటిక్స్ ద్వారా పదాలను గుర్తించడం, వ్యాక్యాలను సొంతంగా చదవడం లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్.ఆర్.ఎస్. విధానం ద్వారా విద్యార్థుల సరాసరి హాజరు 85 శాతం, ఉపాధ్యాయుల హాజరు 87 శాతంతో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. ప్రభుత్వం నూతన భవన నిర్మాణం కోసం కూసుమంచి జూనియర్ కళాశాలకు 5 కోట్ల 50 లక్షలు, సిరిపురం జూనియర్ కళాశాలకు 5 కోట్లు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి మధిర జూనియర్ కళాశాలకు 4 కోట్లు, ముదిగొండ జూనియర్ కళాశాలకు కోటి 76 లక్షలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద ఎర్రుపాలెం మండలం రాజులపాలెం గ్రామం, కల్లూరు మండలంలోని చిన్న కోరుకోండి గ్రామంలో మహిళా సంఘాల ద్వారా 2 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తి ప్రణాళికలు చేపట్టామని, జిల్లాలోని బోనకల్ మండలంలోని 22 గ్రామాలలో పూర్తి స్థాయిలో సోలార్ ద్వారా విద్యుత్ సరఫరా చర్యలు చేపట్టామన్నారు.
155 కోట్లతో ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డును మోడల్ గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపట్టామని, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులను ప్రభుత్వం 19 కోట్ల 90 లక్షలతో నిర్మించినట్లు తెలిపారు. నూతనంగా మత్కెపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటిని ఏర్పాటు చేశామని, నాబార్డ్ సహకారంతో 60 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 15 కొత్త గోదాములను నిర్మిస్తున్నామని అన్నారు.
గ్రామ పంచాయతీలకు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి, నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు పంచాయతీల పరిపాలనపై ప్రత్యేక శిక్షణ అందించామని అన్నారు.
ఆర్ అండ్ బీ శాఖ ద్వారా 180 కోట్లతో మున్నేరు నదిపై తీగల వంతెన నిర్మాణ పనులు, 130 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 140 కోట్లతో 10 రెండు వరుసల రహదారులను, నాలుగు వరుసల రహదారులుగా విస్తరించామని అన్నారు. ప్రభుత్వ ఐటిఐ ఖమ్మంలో 31 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటిసి) నిర్మించామని జిల్లాకు మరొక నాలుగు ఏటీసీ సెంటర్లు మధిర, తిరుమలాయపాలెం, ఏన్కూర్, సత్తుపల్లిలలో ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్ లో 4 కోట్ల అంచనా వ్యయంతో కొత్త సైక్లింగ్ ట్రాక్ లు, బ్యాటరీ వాహనాలు, పార్క్ సదుపాయాలు, ఓపెన్ జిమ్ విస్తరణ, సోలార్ పార్కింగ్ పనులు చేపట్టామని అన్నారు. అమృత్ పథకం క్రింద 229 కోట్లతో ఖమ్మం నగరంలో చేపట్టిన మంచి నీటి సరఫరా పనులు తది దశలో ఉన్నాయని తెలిపారు. టి.యూ.ఎఫ్.ఐ.డి.సి. క్రింద మధిర మున్సిపాల్టీలో 128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణ పనులు, ఎస్.డి.ఎఫ్. క్రింద 140 కోట్లతో మధిరలో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్, అమృత్ పథకం క్రింద 17 కోట్ల 9 లక్షలతో మధిర పట్టణంలో నూతన వాటర్ ట్యాంకర్ల పనులు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో నేలకొండపల్లి బౌద్ధ స్థూపం, పాలేరు లేక్, ఖమ్మం ఖిల్లా, వెలుగు మట్ల అర్బన్ పార్క్ వంటి పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టామని, జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అటవీ పార్క్, కాటేజీ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నా యని, 29 కోట్లతో ఖమ్మం ఖిలా రోప్ వే, పాలేరు లేక్ పార్క్, నేలకొండపల్లి బౌద్ద స్తూపాల అభివృద్ధి, మధిర పెద్ద చెరువు, మామునూరు పేట చెరువు వద్ద పర్యాటక వసతుల కల్పనకు పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్ కు విచ్చేసిన స్వాతంత్ర్య సమరయోధులను జిల్లా కలెక్టర్ కలిసి ఘనంగా సన్మానించారు.
*అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు:
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో పందిళ్లపల్లి పిఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్., హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్, నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కృష్ణప్రసాద్ మెమోరియల్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకొనగా, సంభాని నగర్ జిపిఎస్., కొత్తగూడెంకు చెందిన ఎంపీపిఎస్ విద్యార్థినీ, విద్యార్థులు సంయుక్తంగా జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లాలోనీ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న *ఎవ్రీ చైల్డ్ రీడ్ ఇంగ్లీష్ వన్ హవర్ ఎవ్రీ డే అంటూ ప్రదర్శించిన కళాప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, డిఆర్ఓ పద్మశ్రీ, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిసిపి ప్రసాద్ రావు, జెడ్పీ సి ఈ ఓ దీక్షా రైనా, ఫ్రీడం ఫైటర్స్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థినీ, విద్యార్థులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.