Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై!

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై
సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా
నూతన సీఎంను ఖరారు చేసిన బీజేపీ పెద్దలు
ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బొమ్మైరేపు ప్రమాణస్వీకారం
మాజీ ముఖ్యమంత్రి ఎస్సార్ బొమ్మై తనయుడే బసవరాజు

కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ, బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైని నియమించింది. యడియూరప్ప క్యాబినెట్ లో బొమ్మై ఇప్పటివరకు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బొమ్మై నాయకత్వ లక్షణాలపై బీజేపీ హైకమాండ్ పూర్తి విశ్వాసం ఉంచింది.

ఇవాళ బెంగళూరు విచ్చేసిన బీజేపీ కేంద్ర పరిశీలకుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కర్ణాటక నూతన సీఎంగా బొమ్మై పేరును ప్రకటించారు. అంతకుముందు, ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమై సీఎం ఎంపికపై చర్చించారు.

ఇప్పటివరకు సీఎంగా ఉన్న యడియూరప్ప తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎంపిక అనివార్యమైంది. రేసులో పలువురి పేర్లు వినిపించినప్పటికీ, బీజేపీ పెద్దలు బొమ్మై వైపు మొగ్గు చూపారు. కాగా, బొమ్మై సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అన్నట్టు, బసవరాజు బొమ్మై తండ్రి ఎస్సార్ బొమ్మై కూడా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

Related posts

తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరాలి ….బీజేపీ అగ్రనేత అమిత్ షా!

Drukpadam

కరోనా కట్టడి పై ముఖ్యమంత్రి ద్రుష్టి : నేడు వరంగల్ పర్యటన…

Drukpadam

సీఎం కేసీఆర్ దళిత బాట …ప్రగతి భవన్ లో అఖిలపక్షం దళితులకు ఏటా 10 వేల కోట్లు…

Drukpadam

Leave a Comment