తెలంగాణ వార్తలు

తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు.. కేంద్రం నుంచి కీలక ప్రకటన…

  • బీసీ రిజర్వేషన్ల బిల్లులపై ప్రశ్నించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
  • శాసన సభ కార్యదర్శి నుంచి రెండు బిల్లులు వచ్చినట్లు కేంద్రం వెల్లడి
  • ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయన్న కేంద్రమంత్రి

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. దీనితో కేంద్ర మంత్రి బీఎల్ వర్మ వివరణ ఇచ్చారు. రెండు బీసీ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చాయని, అవి పరిశీలనలో ఉన్నాయని స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్ పెంపునకు సంబంధించి తెలంగాణ శాసనసభ కార్యదర్శి నుంచి రెండు బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి వచ్చాయని తెలిపారు. ఈ బిల్లులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం తెలిసిందే. 

Related posts

హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం..!

Ram Narayana

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన గొర్రెలకాపరి నాగమ్మ

Ram Narayana

ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ఎన్నికల సంఘం

Ram Narayana