ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్!

  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు
  • గవర్నర్ ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలిన వైనం
  • ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పట్టుబట్టిన వైసీపీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరోపక్క, శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ‘ప్రతిపక్ష హోదా ఇవ్వాలి’ అనే ప్లకార్డులను, బ్యానర్లను పట్టుకుని వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ సభ్యులంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. గేట్ నెంబర్ 4 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వీరు సభలోకి వెళ్లారు. 

గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదేపదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినదించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, 11 నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి, సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

సభ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ తన కాన్వాయ్ లో తాడేపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. దీంతో, సభలో జగన్ ఏదైనా మాట్లాడతారేమోనని ఎదురు చూసినవారంతా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.

Related posts

ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు…

Ram Narayana

11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా కోరడం హాస్యాస్పదం: అచ్చెన్నాయుడు!

Ram Narayana

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు… చంద్రబాబు, జగన్ సీట్లు ఎక్కడంటే…!

Ram Narayana