తెలంగాణ వార్తలు

సూర్యాపేట బ్యాలెట్ బాక్స్ లో లేఖ.. అందులో ఏముందంటే!

  • మున్సిపల్ ఫలితాల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్
  • సూర్యాపేట 47వ వార్డు బ్యాలెట్ లో లేఖ
  • రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడంటూ నిలదీసిన విశ్రాంత ఉద్యోగి

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ దూసుకెళుతోంది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓట్లు లెక్కిస్తున్న పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులో ఓ లేఖ కనిపించింది. సూర్యాపేటలోని 47వ వార్డు బ్యాలెట్ బాక్స్ తెరవగా అందులో నుంచి ఓ లేఖ బయటపడింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విశ్రాంత ఉద్యోగి ఒకరు ఈ లేఖ రాశారు. అందులో ఏముందంటే..

‘‘ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా..! మేము రిటైర్ అయి 15 నెలలు గడిచింది. మాకు రావాల్సిన, మీరు చెల్లించాల్సిన ఏ ఒక్క పైసా మాకు రాలేదు. ఇవ్వలేదు. అనేక ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటి వరకు 62 మంది విశ్రాంత ఉద్యోగులు చనిపోయారు. అందుకే బాధతో మేము చనిపోక ముందే మా డబ్బులు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము” అంటూ విశ్రాంత ఉద్యోగి ఒకరు తమ ఆవేదనను వెల్లడించారు.

Related posts

స్కూల్‌లోనే చిన్నారికి నరకం.. జుట్టుపట్టి నేలకేసి బాదిన ఆయా..!

Ram Narayana

హైదరాబాద్ లో బెగ్గర్ ఆదాయం ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!

Ram Narayana

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య!

Ram Narayana