జాతీయ రాజకీయ వార్తలు

నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లను మేమే కైవసం చేసుకుంటాం: మహేశ్ కుమార్ గౌడ్…

  • కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్న మహేశ్ గౌడ్
  • ఈ ఎన్నికలు కవితకు సంతోషాన్ని ఇచ్చి ఉంటాయని వ్యాఖ్య
  • రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉండదన్న పీసీసీ ప్రెసిడెంట్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లను కూడా తామే కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈరోజు సమావేశమవుతానని… ఈ భేటీలో కార్పొరేషన్లపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.   

ఈ ఎన్నికలు కల్వకుంట్ల కవితకు సంతోషాన్ని ఇచ్చి ఉండవచ్చని మహేశ్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు పతనమవుతోందని… రాబోయే రోజుల్లో ఆ పార్టీ ప్రభావం ఉండదని చెప్పారు. మతాన్ని రెచ్చగొట్టినా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఏమీ సాధించలేకపోయిందని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ ఎన్నికల ఫలితాలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన పట్టును మరింత పెంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

బీజేపీకి అర్థం కాని కేజ్రీవాల్ ఎన్నికల వ్యూహాలు..

Ram Narayana

కాంగ్రెస్ కూడా తప్పులు చేసింది: రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Ram Narayana

కర్ణాటకలో సీఎం మార్పు లేనట్టేనా.. హింట్ ఇచ్చిన సిద్ధరామయ్య…

Ram Narayana